Uncategorized

హాట్రిక్ ఫ్లాఫ్స్….బ్లాక్ బస్టర్స్ కి నో….మళ్ళీ షాక్ ఇవ్వనున్న అఖిల్!!

ఫస్ట్ సినిమా రిలీజ్ కన్నా ముందే ఆడియన్స్ లో క్రేజీ ఫాలోయింగ్ ని సొంతం చేసుకోవడం అన్నది చాలా తక్కువ మందికే జరుగుతుంది, అలాంటి క్రేజ్ నే సొంతం చేసుకున్న అతి కొద్ది మంది హీరోల్లో అక్కినేని అఖిల్ కూడా ఒకడు. మనం సినిమా లో చేసిన చిన్న ఇంట్రో కే అఖిల్ కి రెస్పాన్స్ అల్టిమేట్ లెవల్ లో రాగా ఇక ఫుల్ లెంత్ మూవీ తో కుమ్మెస్తాడు అని అంతా భావించారు.

హీరోగా తొలి సినిమా అఖిల్ ఓపెనింగ్స్ పరంగా డెబ్యూ హీరోల్లో ఇప్పటికీ రికార్డ్ హోల్డర్ గానే ఉంది కానీ అఖిల్ ఫాం మాత్రం మునుపటి లా అయితే ఇప్పుడు లేదనే చెప్పాలి. అఖిల్, హలో మరియు మిస్టర్ మజ్ను సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర…

అంచనాలను అందుకోలేక ఒకటి తర్వాత ఒకటి ఫ్లాఫ్స్ గా మిగిలిపోయాయి. ఇలాంటి టైం లో ఒకప్పుడు క్లాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ సినిమా చేస్తున్న అఖిల్ ఈ సినిమా తర్వాత మంచి మంచి ఆఫర్స్ వస్తున్నా వాటిని రిజక్ట్ చేస్తున్నాడట.

ఇది వరకే బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన హి జవానీ హై దివానీ, సోనూ కి టీటు కి స్వీటి మరికొన్ని బ్లాక్ బస్టర్ రిమేక్స్ తెలుగు లో చేయాలి అనుకున్నా అఖిల్ నో చెప్పడం తో ఆగిపోయాయి. ఇక రీసెంట్ గా తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఓ మై కడవులే లాంటి లవ్ స్టొరీ లను కూడా రిజక్ట్ చేస్తున అఖిల్…

మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ సినిమా తర్వాత ఓ కొత్త డైరెక్టర్ తో సినిమా చేస్తాడన్న టాక్ ఇండస్ట్రీ లో గట్టిగా వినిపిస్తుంది. ఒక పక్క బ్లాక్ బస్టర్ సినిమాల రీమేక్ ఆఫర్స్ వస్తున్నా వాటికి నో చెప్పి కొత్త కథలను ఎంచుకుంటున్న అఖిల్ అభిమానుల అంచనాలను ఎంతవరకు అందుకుంటాడు అన్నది ఆసక్తిగా మారింది…

Leave a Comment