న్యూస్

హిందీలో రీమేక్ అవుతున్న ఎన్టీఆర్ ఫ్లాఫ్ మూవీ…9 ఏళ్ల క్రితం అనుకుంటే ఇప్పుడు స్టార్ట్ కానుంది!

ఓన్ కథలు మెప్పించలేక పోతూ ఉండటం తో రీమేక్ లనే ఎక్కువగా నమ్ముకుంటున్న బాలీవుడ్ ఇప్పుడు వాటి పై ఎన్ని విమర్శలు వస్తున్నా కానీ వదలడం అయితే మానడం లేదు, సౌత్ లో హిట్ అయిన సినిమా లను సెలెక్ట్ చేసుకుని ఒక్కొటిగా అక్కడ రీమేక్ చేస్తూ సేఫ్ గేమ్ ఆడుతూ డబ్బులు సంపాదిస్తున్నారు, ఇప్పుడు ఈ లిస్టు లో కొత్తగా ఫ్లాఫ్ మూవీస్ కూడా రీమేక్ అవ్వడం స్టార్ట్ అయ్యింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో డిఫెరెంట్ మూవీగా తెరకెక్కి ఆడియన్స్ ముందుకు వచ్చిన ఊసరవెల్లి సినిమా అందరికీ గుర్తు ఉండే ఉంటుంది, 2011 లో వచ్చిన ఈ సినిమా ఫస్టాఫ్ వరకు అద్బుతంగా మెప్పించినా సెకెండ్ ఆఫ్ ఆకట్టుకోవడంలో విఫలం అవ్వడం, మెయిన్ హీరో సెకెండ్ ఆఫ్ ఆల్ మోస్ట్…

25 నిమిషాలకు పైగా కనిపించకుండా మొత్తం హీరోయిన్ మీదే కథ ఉండటం ఇక్కడ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేదు. దాంతో సినిమా పై అది ఇంపాక్ట్ చూపి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ అవ్వగా కాన్సెప్ట్ కి మాత్రం మంచి పేరు వచ్చింది, ఈ సినిమా గురించి రిలీజ్ కి ముందే…

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ తెలుసుకుని రీమేక్ కోసం ట్రై చేసినా వరుస సినిమాల వలన కుదరలేదు, అప్పటి నుండి అప్పుడప్పుడు రీమేక్ ని కన్ఫాం చేయాలనీ చూసినా ఎప్పటికప్పుడు ఏవో ఒక కొత్త సినిమాల వలన ఈ రీమేక్ ఆగిపోతు రాగా ఎట్టకేలకు ఇప్పుడు ఈ సినిమాను అఫీషియల్ గానే రీమేక్ చేయబోతున్నారు బాలీవుడ్ లో…

అక్షయ్ కుమార్ నిర్మాతగా అండ్ హీరోగా కూడా నటించబోతున్న ఈ రీమేక్ లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తే బాగానే సెట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి స్క్రిప్ట్ లో ముఖ్యంగా సెకెండ్ ఆఫ్ లో మార్పులు చేసి తన స్టైల్ లో బాలీవుడ్ లో దుమ్ము లేపాలని ప్లాన్ చేస్తున్నారట. మరి సినిమా అక్కడ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి మరి.

Leave a Comment