గాసిప్స్ న్యూస్

హిట్టు కొట్టి ఏళ్ళు అయింది..ఈ సారి బ్లాక్ బస్టర్ రీమేక్ లో సునీల్!

టాలీవుడ్ లో కమెడియన్ నుండి హీరోగా మారి వరుస పెట్టి సినిమాలతో జోరు పెంచిన వాళ్ళలో సునీల్ కూడా ఒకరు, కానీ హీరోగా కెరీర్ మొదలు పెట్టినప్పుడు వచ్చిన హిట్స్ తర్వాత ఏ దశలో కూడా సొంతం అవ్వక పోవడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర సునీల్ సినిమాలకు ఆదరణ కూడా తీవ్రంగా తగ్గిపోవడం తో తిరిగి సైడ్ రోల్స్ కామెడీ రోల్స్ అడపాదడపా చేస్తున్న సునీల్ రీసెంట్ టైం లో విలనిజం కూడా…

ట్రై చేసి అందులో కూడా మంచి మార్కులు కొట్టేశాడు. ఇలాంటి టైం లో ఇప్పుడు మళ్ళీ స్పీడ్ అందుకుంటున్న సునీల్ అడపాదడపా హీరోగా కూడా ఛాన్సులను తిరిగి సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం అని చెప్పొచ్చు. ఈ మధ్యే కన్నడలో సూపర్ హిట్ అయిన…

బెల్ బాటం సినిమా తెలుగు రీమేక్ ని ఓకే చేసిన సునీల్ ఇప్పుడు మరో కొత్త సినిమాను కూడా ఓకే చేశాడని టాలీవుడ్ లో టాక్ ఉంది. రీసెంట్ గా తమిళ్ లో కమెడియన్ యోగి బాబు ప్రధాన పాత్రలో రూపొందిన మండేలా అనే సినిమా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుని…

ఆడియన్స్ నుండి ఓ రేంజ్ లో రెస్పాన్స్ ను దక్కించుకుని సూపర్ సక్సెస్ గా నిలిచింది, ఆ సినిమాను ఇప్పుడు తెలుగు లో రీమేక్ చేయాలనీ డిసైడ్ అవ్వగా AK ఎంటర్ టైన్ మెంట్స్ వాళ్ళు రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకోగా తెలుగు వర్షన్ కి గాను సునీల్ ని ప్రధాన రోల్ లో ఎంచుకున్నారని తెలుస్తుంది. పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్ అవ్వడం తో…

సునీల్ ఈ సారి మరింతగా రెచ్చిపోయే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా కానీ సినిమా సునీల్ కి మళ్ళీ అద్బుతమైన బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ సారి బాక్ టు బాక్ హిట్ మూవీస్ రీమేక్ లతో వస్తున్న సునీల్ ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి.

Leave a Comment