గాసిప్స్ న్యూస్

హిట్టు కొట్టి ఏళ్ళు అవుతుంది…రిలీజ్ కి ముందు ఎదురుదెబ్బ….ఇలా చేశారేంటి….కారణం ఇదే!!

మాచో మాన్ గోపీచంద్ హీరోగా హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది, అప్పుడెప్పుడో బాక్స్ ఆఫీస్ దగ్గర లౌక్యం మూవీ తో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న గోపీచంద్ తర్వాత మళ్ళీ హిట్ గీత ని అందుకోలేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా హిట్ అందుకోలేక పోతున్న గోపీచంద్ లేటెస్ట్ గా తనతో గౌతమ్ నంద సినిమా తీసిన సంపత్ నంది డైరెక్షన్ లో తమన్నా హీరోయిన్ గా సీటిమార్ సినిమా చేస్తుండగా…

సినిమా పాటలకు టీసర్ కి పర్వాలేదు అనిపించే రెస్పాన్స్ ఆడియన్స్ లో ఉండగా ఈ సినిమా తో గోపీచంద్ బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ చేయబోతున్నాడని అంతా ఆశించారు, బాక్స్ ఆఫీస్ దగ్గర ఏప్రిల్ 2 న రిలీజ్ కన్ఫాం ను ఎప్పుడో ఫిక్స్ చేసిన యూనిట్ ఇక ప్రమోషన్స్ ను..

మొదలు పెట్టడమే తరువాయి అని అనుకుంటూ ఉండగా సడెన్ గా సినిమా ఆ రోజు రిలీజ్ కావడం లేదు అంటూ టాక్ గట్టిగా టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది, ఆల్ మోస్ట్ మేకర్స్ కూడా ఇది కన్ఫాం చేశారు, ఇలా చేయడానికి కారణాలు ఉన్నాయని టాలీవుడ్ లో టాక్ గట్టిగానే వినిపిస్తుంది.

ఆ టాక్ ప్రకారం సినిమా ఫైనాన్స్ ఇబ్బందుల్లో ఉందని, గోపీచంద్ ప్రీవియస్ మూవీస్ ఫ్లాఫ్ ఎఫెక్ట్ అండ్ ఈ సినిమా ఓవర్ బడ్జెట్ ఇష్యూ వలన ఫైనాన్స్ ఇబ్బందులు ఎదురు అవ్వడం తో రిలీజ్ డేట్ ను మార్చుకోవాల్సి వస్తుందని అంటూ ఉండగా మరో పక్క రిలీజ్ రోజున పోటి తీవ్రంగా ఉండటం తో చాలినన్ని థియేటర్స్ దొరికే అవకాశం లేక పోవడం తో రిలీజ్ డేట్ మారింది అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు.

కారణాలు ఏవి అయినా కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ అయితే ఏప్రిల్ 2 న లేదని తెలుస్తుంది, ఇక సినిమా కుదిరితే ఏప్రిల్ 30 న ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమా పోస్ట్ పోన్ తో ఏప్రిల్ 1-2 లో రిలీజ్ కానున్న వైల్డ్ డాగ్, డబ్బింగ్ మూవీస్ సుల్తాన్ మరియు యువ రత్న మూవీస్ కి కొంచం బెనిఫిట్ లభించబోతుంది అని చెప్పొచ్చు.

Leave a Comment