గాసిప్స్ న్యూస్

హిట్టు కొట్టి 10 ఏళ్ళు…15 కోట్ల సినిమా చేస్తున్న నారా రోహిత్!

కెరీర్ మొదలు పెట్టడం మంచి హిట్స్ తో మొదలు పెట్టి తర్వాత వరుస ఫ్లాఫ్స్ తో కెరీర్ లో పూర్తిగా డౌన్ అయిన హీరోల్లో నారా రోహిత్ కూడా ఒకరు, బాణం అనే డిఫెరెంట్ సినిమా తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి కమర్షియల్ హిట్ కొట్టకపోయినా మంచి లాంచింగ్ మూవీగా ప్రశంసలు సొంతం చేసుకోగా తర్వాత రెండో సినిమా సోలో తో 2011 లో సూపర్ డూపర్ హిట్ ని సొంతం చేసుకున్నాడు.

దాంతో ఇక నారా రోహిత్ కెరీర్ టర్న్ అయ్యింది లెక్కకు మిక్కిలి ఆఫర్స్ వచ్చాయి అందులో కొన్ని మంచి సినిమాలు ఉన్నా ఎక్కువగా నాసిరకం కథలు ఉండటం తో…. అందులో ఒక్కటి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గీత దాటలేదు. రౌడీ ఫెలో, జో అచ్చుతానంద, ప్రతినిది లాంటి మంచి సినిమాలు కూడా…

ఫ్లాఫ్స్ ఫ్లో వల్ల బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరచగా అప్పుడప్పుడు స్పెషల్ క్యామియోలు చేస్తున్న నారా రోహిత్ హీరోగా కొత్త సినిమా మొదలు పెట్టి చాలా కాలమే అవుతుంది, ఇలాంటి టైం లో ఇప్పుడు ఓ భారీ మూవీ ని ప్లాన్ చేస్తున్నాడు అన్నది టాలీవుడ్ టాక్.

తనతో మొదటి సినిమా బాణం తీసిన డైరెక్టర్ దంతలూరి డైరెక్షన్ లో 1971లో ఒక యుద్దం సమయంలో జరిగిన కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించబోతున్నారట. యుద్దంతో పాటు ప్రేమ కథ కూడా అల్లుకుని ఈ సినిమా ను రూపొంచబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిందని, ఫస్ట్ వేవ్ ఎండ్ టైం లో ఈ సినిమా  పనులు మొదలు అయ్యాయి….

ఈ ఇయర్ లో సినిమా సెట్స్ పైకి కూడా వెళ్ళింది కానీ సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్ ఆగిపోయింది… ఇక ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ ని కేటాయించబోతున్నారట. అది ఎంత అనేది త్వరలోనే క్లియర్ గా తెలియనుంది, కానీ ట్రేడ్ టాక్ ప్రకారం 15 కోట్లకు పైగానే బడ్జెట్ అవుతుందని అంటున్నారు, ఇక నారా రోహిత్ ఇప్పటికే తన బాడీ ని మార్చుకుని న్యూ లుక్ తో ఈ సినిమా లో కనిపిస్తారని అంటున్నారు. మరి ఈ సినిమా తో అయినా హిట్ గీత దాటుతాడో లేదో చూడాలి.

Leave a Comment