న్యూస్ బాక్స్ ఆఫీస్

హిట్టు కొట్టి 9 ఏళ్ళు…అయినా నిర్మాతకి లాభాలు తెప్పించిన అల్లరోడు!!

కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన హీరో అల్లరి నరేష్, ఇప్పుడంటే బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన విజయం లేక వరుస ఫ్లాఫ్స్ ను ఎదురుకుంటూ ఉన్నాడు కానీ ఒకప్పుడు అల్లరి నరేష్ సినిమా అంటే టాక్ ఎలా ఉన్నా పర్వాలేదు కామెడీ ఉంటుంది, ఒక గంట హాయిగా నవ్వుకోవచ్చు అని థియేటర్స్ కి వెళ్ళేవాళ్ళు, అలా తనకంటూ ఒక మార్కెట్ ని మినిమమ్ టాక్ కి అతీతంగా…

10 నుండి 12 కోట్ల రేంజ్ మార్కెట్ ని ఏర్పరచుకుని ఏడాదికి మూడు నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అల్లరి నరేష్ సుడిగాడు తో తన కెరీర్ బెస్ట్ రికార్డులు అందుకున్న తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర మళ్ళీ అలాంటి విజయాన్ని నమోదు చేయలేక…

తన మార్కెట్ ని కోల్పోతూ వచ్చాడు, ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ కొట్టి 9 ఏళ్ళు అవుతున్నా  ఇప్పటికీ క్లీన్ హిట్ వేటలో ఉన్న అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ మూవీ బంగారు బుల్లోడు సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా నే అయినా లేట్ అవుతూ రాగా…

రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తో కూడా నిర్మాతకి మంచి లాభాలను తెచ్చి పెట్టాడు, సినిమా స్ట్రిక్ట్ బడ్జెట్ లో 2.5 కోట్ల లోపు బడ్జెట్ తో రూపొందగా… థియేట్రికల్ బిజినెస్ 3.2 కోట్లు కాగా, డిజిటల్ రైట్స్ 1.2 కోట్లు, శాటిలైట్ రైట్స్ 1.5 కోట్ల రేటు పలికాయి. మొత్తం మీద సినిమా అన్నీ కలిపి బిజినెస్ రూపంలో 5.9 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా…

మొత్తం మీద బడ్జెట్ మీద సినిమా టోటల్ గా 3.4 కోట్ల రేంజ్ టేబుల్ ప్రాఫిట్ ని నిర్మాతకి దక్కేలా చేసింది ఈ సినిమా… వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నా కూడా నిర్మాతకి టేబుల్ ప్రాఫిట్ తెప్పించాడు అల్లరోడు.. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గరే సినిమా కొన్న వాళ్ళకి డబ్బులు తిరిగి రప్పించాల్సిన అవసరం ఉందని చెప్పాలి.

Leave a Comment