గాసిప్స్ న్యూస్

హిట్ అవ్వాల్సిన సినిమా ఫట్ అయింది…కానీ ఇక్కడ ఈ సినిమా రికార్డ్ ఔట్ అంట!!

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ వచ్చిన సినిమాల్లో కొన్ని సినిమాలు టాక్ బాగున్నా కానీ కలెక్షన్స్ పరంగా అంచనాలను అందుకోలేక పోయాయి. కానీ ఒక్క సినిమా విషయం లో మాత్రం టాక్ బాగుండి ఇక సినిమా పుంజుకుంటుంది అనుకున్న టైం లో అనుకోకుండా పరుగును మధ్య లోనే ఆపి వేరే సినిమాల రిలీజ్ కోసం ఈ సినిమా పరుగును మధ్యలోనే ఆపేశారు. ఆ సినిమానే సందీప్ కిషన్ 25 వ సినిమా ఏ 1 ఎక్స్ ప్రెస్…

మార్చ్ మొదటి వారం లో వచ్చిన ఈ సినిమా వర్కింగ్ డేస్ లో బాగా హోల్డ్ చేసి కలెక్షన్స్ ని సాధిస్తూ బ్రేక్ ఈవెన్ కి చేరువ అయ్యే టైం లో సెకెండ్ వీక్ లో కొత్త సినిమాలు కుప్పలుగా రిలీజ్ అవుతున్న టైం క….

ఈ సినిమా థియేటర్స్ ని కంప్లీట్ గా తగ్గించారు…. దాంతో సినిమా రన్ మధ్యలోనే ఆగిపోయి హిట్ అవ్వాల్సిన సినిమా యావరేజ్ గా నిలిచింది, కానీ ఇదే సినిమా ఇప్పుడు రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ అయ్యి సాలిడ్ వ్యూస్ తో దూసుకు పోతుందని సమాచారం… ఈ సినిమా రీసెంట్ గా…

సన్ నెక్స్ట్ లో డిజిటల్ రిలీజ్ అవ్వగా ఆ యాప్ లో రీసెంట్ గా శర్వానంద్ నటించిన శ్రీకారం మూవీ రిలీజ్ అయ్యి ఆ యాప్ లో హైయెస్ట్ వ్యూస్ ని మొదటి వీకెండ్ లో సొంతం చేసుకుందని చెప్పగా… ఇప్పుడు ఆ వ్యూస్ ని కూడా దాటేసి సన్ నెక్స్ట్ లో హైయెస్ట్ వ్యూస్ తో… ఏ 1 ఎక్స్ ప్రెస్ సినిమా దుమ్ము లేపిందని అంటున్నారు.

మొత్తం మీద 2 సినిమాలకు ఎన్ని వ్యూస్ వచ్చాయి అన్నది ఏమి చెప్పడం లేదు కానీ సాలిడ్ వ్యూస్ తో రెండు సినిమాలు కుమ్మేశాయని, ఏ 1 ఎక్స్ ప్రెస్ అయితే శర్వానంద్ శ్రీకారం వ్యూస్ రికార్డ్ ని మించి వ్యూస్ తో దూసుకు పోతుందని అంటున్నారు. ఫస్ట్ వీక్ తర్వాత సినిమా వ్యూస్ కౌంట్ ఎంత అనేది రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ రిలీజ్ అయితే మళ్ళీ వ్యూస్ కౌంట్ ని అప్ డేట్ చేస్తాం.

Leave a Comment