గాసిప్స్ న్యూస్

హిట్ కొట్టి ఏళ్ళు అవుతుంది…సీక్వెల్ అనౌన్స్ చేసి షాకింగ్ కామెంట్స్ చేశారు!

శ్రీనువైట్ల మరియి మంచు విష్ణుల కాంబినేషన్ లో వచ్చిన ఢీ సినిమా తెలుగు లో వన్ ఆఫ్ పాత్ బ్రేకింగ్ మూవీస్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు, అలాంటి కాన్సెప్ట్ తో తర్వాత అనేక సినిమాలు కుప్పలుతెప్పలుగా వచ్చాయి, ఇటు శ్రీనువైట్ల కి అటు మంచు విష్ణు కి ఓవర్ నైట్ లో క్రేజ్ డబుల్ అయింది, కానీ ఇద్దరిలో శ్రీనువైట్ల ఆ క్రేజ్ ని మరింత పెంచుకోగా మంచు విష్ణు మాత్రం…

రొటీన్ మూవీస్ తో క్రేజ్ ని తగ్గించుకున్నాడు, ఇక ప్రస్తుతం ఇద్దరూ కూడా హిట్ కి దూరం అయ్యి ఏళ్ళు అవుతున్న టైం లో ఎప్పటి నుండో అనుకుంటున్నట్లు ఢీ కి సీక్వెల్ మొదలు పెట్టాలని ఫిక్స్ అయ్యి ఎట్టకేలకు రీసెంట్ గా మంచు విష్ణు పుట్టిన రోజు టైం లో…

సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు, కానీ అదే టైం లో సినిమా గురించిన మరిన్ని విశేషాలను తెలియజేస్తూ శ్రీనువైట్ల సినిమా పై షాకింగ్ కామెంట్స్ కూడా చేశారు, అందరూ ఈ సినిమా ఢీ కి సీక్వెల్ గానే భావిస్తున్న టైం లో ఈ సినిమా సీక్వెల్ కాదని చెప్పారట.

కొత్త కథతో డిఫెరెంట్ గా సినిమాను ప్లాన్ చేస్తున్నామని చెప్పారట శ్రీనువైట్ల. దాంతో అందరూ ఢీ సీక్వెల్ కాదు అనే సరికి ఒకింత షాక్ అయ్యారని చెప్పొచ్చు. సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన తర్వాత జనాల్లో ఇది ఢీ సీక్వెల్ గానే వెళ్ళింది కానీ వీళ్ళ కాంబో లో కొత్త సినిమాగా కాదు. కానీ ఇది కొత్త సినిమా అని…

ఎందుకు చెప్పారు అన్నది సినిమా రిలీజ్ అయ్యాకే చెప్పగలం కానీ మరో టాక్ ఏంటి అంటే ఢీ సీక్వెల్ అంటే ఇప్పటి నుండే అంచనాలు పెరిగి పోతాయి అవి మ్యాచ్ అవుతాయో లేవో చెప్పలేం కాబట్టి ఢీ సీక్వెల్ కాదని చెప్పారు అంటున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా తో శ్రీనువైట్ల కంబ్యాక్ సాలిడ్ గా ఇచ్చి మళ్ళీ ఎంటర్ టైనర్స్ తో దుమ్ము లేపాలని అందరూ కోరుకుంటున్నారు.

Leave a Comment