గాసిప్స్ న్యూస్

హిట్ కొట్టి 7 ఏళ్ళు…నిర్మాతకి 2 కోట్లు తిరిగి ఇచ్చేసిన గోపీచంద్…రీజన్ ఇదే!

బాక్స్ ఆఫీస్ దగ్గర మాచో మాన్ గోపీచంద్ హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది… మాస్ హీరోగా మంచి పేరు సొంతం చేసుకున్నా అది నిలబెట్టుకునే రేంజ్ సినిమాలు పడక మార్కెట్ కోల్పోయిన హీరోల్లో గోపీచంద్ కూడా ఒకరు, సాలిడ్ మాస్ హిట్స్ పడినా కానీ కెరీర్ ని సరైన టైం లో సరిగ్గా ప్లాన్ చేసుకోవడంతో తప్పటడుగులు వేసిన గోపీచంద్ కి ప్రస్తుతం హిట్ లేక చాలా కాలమే అవుతుంది. 2014 లో లౌక్యం సినిమాతో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్న గోపీచంద్…

తర్వాత చేసిన సినిమా చేసినట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ అవ్వగా అందులో కొన్ని మంచి సినిమాలు ఉన్నా ఫ్లాఫ్ ఫ్లోల వల్ల అవి కూడా ఎదురుదెబ్బ తిన్నాయి. ఇలాంటి టైం లో వేరే ఎవరైనా అయితే ఎన్ని కొత్త సినిమా ఆఫర్లు వస్తే అన్ని ఒప్పుకోవాలని చూస్తారు.

అలాగే రెమ్యునరేషన్ ని కూడా పూర్తిగా తగ్గించుకుంటారు… ఇన్ని ఫ్లాఫ్స్ పడ్డా గోపీచంద్ తో మీడియం రేంజ్ మూవీస్ కి చాలామంది నిర్మాతలు క్యూ కట్టడం ఇంకా తనకి క్రేజ్ ఉందని నిదర్శనం అని చెప్పాలి. లేటెస్ట్ గా ఒక సినిమా కోసం తాను తీసుకున్న అడ్వాన్స్ ని ఇప్పుడు రిటర్న్ ఇచ్చేశాడు గోపీచంద్.

బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో గోపీచంద్ కొత్త సినిమా ప్రకటన ఇవ్వడం జరిగింది. సినిమాను కొత్త దర్శకుడు బిను సుబ్రహ్మణ్యం తెరకెక్కిస్తారని అధికారికంగా తెలిపారు. సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.కానీ ఎందుకనో ఆ ప్రాజెక్ట్ అస్సలు పట్టాలు ఎక్కలేదు. ఈ సినిమా కోసం గోపీచంద్ కి నిర్మాత 2 కోట్ల అడ్వాన్స్ కూడా ఇచ్చారని సమాచారం.

కానీ సినిమా ఇప్పటి వరకు మొదలు అవ్వడం తో సినిమా కోసం తీసుకున్న అడ్వాన్స్ ని గోపీచంద్ రిటర్న్ ఇచ్చేశారని సమాచారం. నిర్మాత కొత్త సినిమా చేద్దామన్నా కథ సెట్ అయ్యాక మళ్ళీ ఇద్దురు గాని అని చెప్పి మరీ రిటర్న్ ఇచ్చేశాడట గోపీచంద్. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర త్వరలో సీటిమార్ తో రానున్న గోపీచంద్ ఈ సినిమా తో అయినా భారీ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం…

Leave a Comment