గాసిప్స్ న్యూస్

హిట్ కొట్టి 8 ఏళ్ళు…మంచు విష్ణు “మోసగాళ్ళు” బడ్జెట్ తెలిస్తే మైండ్ బ్లాంక్!!

కెరీర్ మొదలు పెట్టి ఏళ్ళు అవుతున్నా, మంచి స్టార్ బ్యాగ్ డ్రాప్ ఉన్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర నికార్సయిన హిట్ లు చాలా తక్కువగా ఉన్న హీరోలలో మంచు హీరోలు కూడా ఉంటారు, మంచు మనోజ్ ఒక టైం లో మంచి విజయాలనే అందుకున్నా మంచు విష్ణు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంపాక్ట్ చూపి చాలా కాలమే అవుతుంది. ముందుగా ఢీ సినిమా తో తోలి కమర్షియల్ బాక్స్ ఆఫీస్…

బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకుని వరుస ఆఫర్లతో దూసుకు పోయిన మంచు విష్ణు తర్వాత వరుస ఫ్లాఫ్స్ ని ఎదురుకోగా మళ్ళీ 8 ఏళ్ల క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర దేనికైనా రెడీ సినిమా తో మంచి కంబ్యాక్ ఇచ్చాడు, తర్వాత దూసుకెల్తా సినిమా తో కూడా మెప్పించాడు.

కానీ తర్వాత మళ్ళీ ఒకటి తర్వాత ఒకటి ఫ్లాఫ్స్ ఎదురు అవుతూ రాగా ఆల్ మోస్ట్ మార్కెట్ కోల్పోయిన స్టేజ్ లో ఓ భారీ మూవీని మొదలు పెట్టాడు, హాలీవుడ్ అండ్ తెలుగు లో కలిపి కాజల్ అగర్వాల్ తో కలిసి మోసగాళ్ళు అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

సగం షూటింగ్ కంప్లీట్ అయిన ఈ సినిమా మోషన్ పోస్టర్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు, కాగా ఈ సినిమా బడ్జెట్ గురించిన న్యూస్ ఒకటి ట్రేడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది, అది ఎంతవరకు నిజం అన్నది తెలియదు కానీ సినిమా కోసం ఏకంగా 80 కోట్ల రేంజ్ బడ్జెట్ ని పెట్టారని అంటున్నారు.

సగం షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా మిగిలిన సగం త్వరలో షూటింగ్ జరుగుతుందని అంటున్నారు, వరల్డ్ బిగ్గెస్ట్ IT స్కాం మీద తీస్తున్న ఈ సినిమాకి డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ కాగా ఈ సినిమా బడ్జెట్ గురించిన న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుండగా అసలే 8 ఏళ్లుగా హిట్ లేని హీరో మీద ఈ రేంజ్ బడ్జెట్ వర్కౌట్ అవుతుందా అని అనుమానాలు మొదలు అయ్యాయి. ఈ సినిమా తో అయినా విష్ణు కంబ్యాక్ చేస్తాడేమో చూడాలి.

Leave a Comment