గాసిప్స్ న్యూస్

హిట్ టాక్…డిసాస్టర్ రిజల్ట్…బట్ అక్కడ రికార్డులు క్రియేట్ చేసిందట ఈ సినిమా!

ఫస్ట్ వేవ్ తర్వాత టాలీవుడ్ లో వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అవ్వడం జరిగింది, ఈ ఫ్లో లో కొన్ని టాక్ రాని సినిమాలు కూడా దుమ్ము లేపగా, కొన్ని టాక్ వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేక పోయాయి. ఈ కోవ లోకే వచ్చే సినిమా గా శర్వానంద్ నటించిన శ్రీకారం సినిమా గురించి చెప్పుకోవాలి. ఈ సినిమా జాతిరత్నాలు సినిమా కి పోటిగా రిలీజ్ అవ్వగా…

ఆ సినిమా ప్రభంజనం ముందు నిలబడలేక పోయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ తో కూడా డిసాస్టర్ రిజల్ట్ నే సొంతం చేసుకుంది. 17.5 కోట్ల టార్గెట్ కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9.64 కోట్ల షేర్ ని మాత్రమే సొంతం చేసుకుని 7.8 కోట్లకు పైగా లాస్ ను…

సొంతం చేసుకుని డిసాస్టర్ అయ్యింది, హిట్ టాక్ వచ్చినా ఇలాంటి రిజల్ట్ ను ఎవ్వరూ ఊహించి ఉండదు అనే చెప్పాలి. ఇక ఈ సినిమా ను రీసెంట్ గా డిజిటల్ రిలీజ్ చేశారు… సినిమా హక్కులను సొంతం చేసుకున్న సన్ నెక్స్ట్ యాప్ వాళ్ళు ఈ సినిమాను బాగానే ప్రమోట్ చేయగా…

వాళ్ళ యాప్ లో డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకున్న అన్ని సినిమాలలోకి ఈ సినిమా ఆల్ టైం హైయెస్ట్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపిందని అంటున్నారు వాళ్ళు. ఎన్ని వ్యూస్ అనేది చెప్పకున్నా కానీ ఇప్పటి వరకు ఏ సినిమా కి కూడా రానంత వ్యూస్ మాకు ఈ సినిమా ద్వారా వచ్చిందని వాళ్ళు చెబుతున్నారట….

మొత్తం మీద శర్వానంద్ బాక్స్ ఆఫీస్ దగ్గర పోటి వలన అంచనాలను అందుకొక పోయినా కానీ డిజిటల్ రిలీజ్ తర్వాత జనాలకు సినిమా బాగా రీచ్ అవుతూ ఉండటం తో సంతోషంగా ఉన్నట్లు సమాచారం. సినిమా డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న సన్ నెక్స్ట్ వాళ్ళు అతి త్వరలో ఈ సినిమా ద్వారా ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అవుతామని ధీమా గా ఉన్నారట.

Leave a Comment