టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

హిట్ టాక్…8.5 కోట్ల టార్గెట్….టోటల్ గా వచ్చింది ఇది…పాపం!

మంచి స్టార్ బ్యాగ్రౌండ్ ఉన్న సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న సుధీర్ బాబు ఒక సినిమా కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర నికార్సయిన హిట్ పడటం లేదు, లేటెస్ట్ గా సుధీర్ బాబు ఆనంది ల కాంబినేషన్ లో పలాసా డైరెక్టర్ తో కలిసి చేసిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాగా…

సినిమా కి ఆడియన్స్ నుండి మంచి టాకే లభించింది కానీ నైజాంలో జనాలు థియేటర్స్ కి రాకపోవడం, ఆంధ్రలో ఉన్న పరిస్థితుల ఎఫెక్ట్ వలన సినిమా కి కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో రాలేదు, కానీ బిజినెస్ ఎక్కువ అవ్వడం తో ఆ బిజినెస్ ను అందుకోవడానికి సినిమా…

కష్టపడింది కానీ లాంగ్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర నష్టాలు తప్పలేదు సినిమాకి. బిజినెస్ కొంచం తగ్గి ఉంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉండేది కానీ ఎక్కువ టార్గెట్ ని అందుకోలేక పోయిన ఈ సినిమా హిట్ అవ్వాల్సిన సత్తా ఉన్నా ఫ్లాఫ్ గా నిలిచింది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కని ఒకసారి గమనిస్తే…
👉Nizam: 1.62Cr
👉Ceeded: 84L
👉UA: 79L
👉East: 46L
👉West: 26L
👉Guntur: 49L
👉Krishna: 28L
👉Nellore: 17L
AP-TG Total:- 4.91CR(8.35Cr Gross)
KA+ROI: 14L
OS: 29L~
Total Collections: 5.34CR(9.25CR~ Gross)(63% Recovery)
ఇదీ సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్.

8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కి 8.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా టోటల్ రన్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 3.16 కోట్ల లాస్ ను సొంతం చేసుకుని భారీ నష్టాలతో ఫ్లాఫ్ గా నిలిచింది. 5 కోట్ల రేంజ్ బిజినెస్ జరిగి ఉంటే సినిమా హిట్ అయ్యేది కానీ ఎక్కువ బిజినెస్ సినిమా పై ఎఫెక్ట్ చూపి సుధీర్ బాబు కెరీర్ లో మంచి మూవీ గా నిలిచినా కలెక్షన్స్ వైజ్ నిరాశ పరిచింది.

Leave a Comment