గాసిప్స్ న్యూస్

హిట్ లేక 7 ఏళ్ళు…కానీ ఒక్క ఫైట్ కి ఇన్ని కోట్లా….షాకిచ్చిన మనోజ్!

ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నా కానీ సరైన సినిమాలు చేయలేక ఆ క్రేజ్ ని తగ్గించుకున్న హీరోల్లో మంచు మనోజ్ కూడా ఒకరు అని చెప్పాలి. రీసెంట్ టైం లో అన్ని బిలో యావరేజ్ సినిమాల తోనే సరి పెట్టు కుంటూ వస్తున్నా మంచు మనోజ్ కి మంచి సినిమా పడితే ఈజీగా 10-15 కోట్ల రేంజ్ షేర్ ని అందుకోగల సత్తా ఎంతైనా ఉందని చెప్పాలి. కానీ హిట్ పడి చాలా కాలమే అవుతుంది…

అప్పుడెప్పుడో 2013 – 2014 టైం లో పోటుగాడు, కరెంట్ తీగ లాంటి సినిమాలతో మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని వాటి హెల్ప్ తో ఆల్ మోస్ట్ హిట్ మూవీస్ కొట్టిన మంచు మనోజ్ తర్వాత 7 ఏళ్ళు అవుతున్నా కానీ ఇప్పటి వరకు క్లీన్ హిట్ అందుకోలేదు. అయినా కానీ భారీ బడ్జెట్ తో….

పాన్ ఇండియా లెవల్ లో రూపొంచబోతున్న తన అప్ కమింగ్ మూవీ అయిన “అహం బ్రహ్మాస్మి” సినిమా అప్ డేట్ ని చెప్పారు. తన కెరీర్ లోనే భారీ ఎత్తున ఈ సినిమా రూపొంద బోతుందని తెలియజేయగా… భారీ లెవల్ లో ఏకంగా 6 కోట్లతో ఒక రియల్ యాక్షన్ సీన్  భారీ గా ఉండబోతుందని తెలియజేశారు…

కానీ పరిస్థితులు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇంకా సెట్ కాక పోయినా కానీ కొన్ని సినిమాల షూటింగ్ కి డిలే అవుతూ రాగా ఎట్టకేలకు ఫస్ట్ వేవ్ ఎఫెక్ట్ అయిపోయాక విడతలుగా ఈ భారీ యాక్షన్ సీన్ షూటింగ్ ని జరిపారని తెలుస్తుంది… ముందు 6 కోట్ల బడ్జెట్ ఈ ఫైట్ కి అనుకున్నప్పటికీ పూర్తీ అయ్యే టైం కి 6.5 కోట్ల వరకు అయ్యిందని అంటున్నారు…

సుమారు 50 రోజుల పాటు భారీ లెవల్ లో జరిగే ఈ ఫైట్ సీన్ లో ఎలాంటి డూప్ లేకుండా మంచు మనోజ్ మూవీస్ లో ఉండే రియల్ యాక్షన్ సీన్స్ తో ఈ షూటింగ్ ఉంటుందని ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటున్న ఈ సినిమా తో అయినా మంచు మనోజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం….

Leave a Comment