న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

0.5 కొడితే చాలు…ఇండస్ట్రీ రికార్డ్ బద్దలు!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ అల వైకుంఠ పురం లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోస్తూ దూసుకు పోతుంది, సినిమా మొదటి వారం మొత్తం హాలిడేస్ అవ్వడం తో టాలీవుడ్ హిస్టరీ లోనే బాహుబలి ని పక్కకు పెడితే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్న రేంజ్ లో కలెక్షన్స్ తో ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసిన ఈ సినిమా కొన్ని రోజుల్లో ఏకంగా బాహుబలి రికార్డ్ నే బ్రేక్ చేసింది.

ఇక సినిమా ఇక్కడ ఏ రేంజ్ లో దుమ్ము దుమారం చేసిందో ఓవర్సీస్ లో కూడా అదే రేంజ్ లో రికార్డులను తిరగరాసింది. ఇక్కడా అక్కడా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కూడా పాజిటివ్ టాక్ తో రెచ్చి పోతున్నా ఆ సినిమా ని కూడా…

మించే విధంగా దుమ్ము లేపిన ఈ సినిమా ఇక్కడ దాటడమే కాకుండా అక్కడ కూడా దాటేది ఇప్పుడు ఏకంగా 3 మిలియన్ మార్క్ ని అమెరికా లో అందుకుని ఈ మార్క్ ని అందుకున్న అతికొద్ది సినిమా ల్లో ఒకటిగా నిలిచి చరిత్ర సృష్టించింది. వర్కింగ్ డేస్ లో కూడా అక్కడ…

సూపర్ స్ట్రాంగ్ గా ఉన్న సినిమా కలెక్షన్స్ అక్కడ మరో హాల్ఫ్ మిలియన్ మార్క్ ని అందుకుంటే… రంగస్థలం మరియు భరత్ అనే నేను సినిమాలను క్రాస్ చేసి సంచలనం సృష్టించడం ఖాయం. సినిమా జోరు చూస్తుంటే ట్యూస్ డే ఆఫర్స్ తోనో లేక ఈ వీక్ పూర్తీ అయ్యే సరికి అయినా…

ఈ మార్క్ ని పూర్తీ చేసుకుని అక్కడ కూడా ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేయడం ఖాయమని చెప్పొచ్చు. బాక్స్ ఆఫీస్ దగ్గర సరైనోడు తర్వాత పెర్ఫెక్ట్ హిట్ లేక పోయినా కానీ అల్లు అర్జున్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏడాదిన్నర కి పైగా సినిమా చేయక పోయినా కానీ సెన్సేషనల్ కంబ్యాక్ తో అందరి మైండ్ బ్లాక్ చేసే ఇండస్ట్రీ హిట్ కొట్టబోతున్నాడు.

Leave a Comment