న్యూస్

1.1M ఔట్ ఇక్కడ…88 ఏళ్ల చరిత్రలో ఒకే ఒక్కడు!!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న సెన్సేషనల్ మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఇంట్రో టీసర్ లు టాలీవుడ్ చరిత్ర లో కొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకు పోతున్నాయి. ఒక పక్క కొమరం భీమ్ ఇంట్రో టీసర్ టాలీవుడ్ తరుపున కొత్త రికార్డులను నమోదు చేస్తుంటే… మరో పక్క…

ఇతర భాషల్లో కూడా టీసర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ దక్కుతుండటం విశేషం అనే చెప్పాలి. టాలీవుడ్ తరుపున మొట్ట మొదటి 8 లక్షల నుండి 1 మిలియన్స్ లైక్స్ ని సొంతం చేసుకున్న టీసర్ గా కొత్త రికార్డ్ ను నమోదు చేసిన కొమరం భీమ్ ఇంట్రో టీసర్…..

ఇప్పుడు మరో బెంచ్ మార్క్ ని అందుకుంది. 1 మిలియన్ లైక్స్ ని అందుకున్నాక స్లో అవుతుంది అనుకున్నా టీసర్ ఇప్పటికీ వ్యూస్ అండ్ లైక్స్ తో దూసుకు పోతుండటం విశేషం. లేటెస్ట్ గా ఇప్పుడు టీసర్ 1.1 మిలియన్ లైక్స్ ని సొంతం చేసుకుని సంచలన రికార్డ్ ను నమోదు చేసింది.

దాంతో టాలీవుడ్ తరుపున 88 ఏళ్లలో మొట్ట మొదటి 1 మిలియన్ అండ్  1.1 మిలియన్ మార్క్ ని అందుకున్న టీసర్ గా అల్టిమేట్ రికార్డ్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించిన ఈ టీసర్ యూట్యూబ్ ట్రెండ్ పేజ్ లో ఆల్ మోస్ట్ 80 గంటల పాటు నాన్ స్టాప్ గా టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవ్వడం విశేషం అనే చెప్పాలి.

ఇక లైక్స్ పరంగా ఇండియా లో కూడా హైయెస్ట్ లైక్స్ ని సొంతం చేసుకున్న టీసర్ ల విషయం లో టాప్ 3 లో ఒకటిగా నిలిచి దుమ్ము దుమారం చేసిన రామరాజు ఫర్ భీమ్ టీసర్ ఇంట్రో టీసర్ల కే భీభత్సం సృష్టించగా సినిమా మెయిన్ టీసర్ ట్రైలర్ లు వచ్చాకా ఎలాంటి భీభత్సం క్రియేట్ చేస్తాయి అన్నది ఆసక్తిగా మారింది.

Leave a Comment