టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

1.2 కోట్లకు అమ్మితే…టోటల్ తెలుగు OTT కలెక్షన్స్ ఇవి!!

OTT లో డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకున్న సినిమాల్లో ఎక్కువ శాతం తెలుగు లో మలయాళం నుండి డబ్ అయిన సినిమాలే ఉన్నాయి, అందులో కూడా ఎక్కువ సినిమాలు ఆహా యాప్ లో డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకోగా కొన్ని సినిమాలు బాగా ఆకట్టుకున్నాయి, కొన్ని సినిమాలు అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకోలేదు, ఇలా మలయాళం నుండి తెలుగు కి వచ్చిన సినిమా లలో…

ఫహాద్ ఫాజిల్ మరియు నజ్రియా కలిసి నటించిన సినిమా ట్రాన్స్ మలయాళం లో ఈ ఇయర్ క్రేజీ మూవీ గా రిలీజ్ అయ్యి అంచనాలను అందుకోలేక పోయింది, ఇక సినిమాను తెలుగు లో ఆహా యాప్ వాళ్ళు సుమారు 1.2 కోట్ల రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకుని….

ఆగస్టు మొదటి వారం లో సినిమాను డైరెక్ట్ రిలీజ్ చేయగా ఫస్టాఫ్ వరకు ఆదర గొట్టేసిన సినిమా సెకెండ్ ఆఫ్ విషయం లో మాత్రం అంచనాలను అందు కోలేదు, అయినా కానీ ఆహా యాప్ లో సినిమా కి టోటల్ గా 4 నెలలు కలిపి సాలిడ్ వ్యూస్ దక్కాయి అని చెప్పాలి.

మొదటి నెలలోనే సినిమాకి మొత్తం మీద 2 లక్షల 20 వేల దాకా వ్యూస్ దక్కగా తర్వాత మిగిలిన మూడు నెలలు కలిపి 1 లక్షల 45 వేల దాకా వ్యూస్ దక్కినట్లు సమాచారం. దాంతో టోటల్ గా 4 నెలలకు గాను ఈ సినిమా మొత్తం మీద 3 లక్షల 65 వేల దాకా యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా… ఈ వ్యూస్ తో ఎంత వరకు కలెక్షన్స్ ని అందుకుంది అన్నది…

అంచనా వేస్తె ఆహా యాప్ ఒక నెల రేటు 50 ని సినిమా టికెట్ రేటుగా భావిస్తే 3 లక్షల 65 వేల వ్యూస్ కి 50 టికెట్ రేటు తో 1.82 కోట్ల దాకా రెవెన్యూ ని ఈ సినిమా సొంతం చేసుకుని ఉండొచ్చు… అంటే పెట్టిన 1.2 కోట్లకు మరో 60 లక్షల రేంజ్ ప్రాఫిట్ ని సినిమా సొంతం చేసుకుందని చెప్పొచ్చు.

Leave a Comment