టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

1.2 కోట్ల సినిమా…180 థియేటర్స్ లో రిలీజ్…కానీ వచ్చింది ఇది!!

రీసెంట్ టైం లో రిలీజ్ అయిన చిన్న మూవీస్ లో సోషల్ మీడియా లో విపరీతంగా ప్రమోషన్స్ ను సొంతం చేసుకుని రిలీజ్ అయిన సినిమా గా యాంకర్ శ్రీముఖి ముఖ్య రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ క్రేజీ అంకుల్స్ నిలుస్తుంది అని చెప్పాలి. చిన్న సినిమా నే అయినా ప్రమోషన్స్ పరంగా మీమ్స్ తో సోషల్ మీడియా లో తెగ ప్రమోషన్స్ ను సొంతం చేసుకుని ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమా…

కానీ సినిమాలో కంటెంట్ ఏమాత్రం లేక పోవడం తో జనాలు మొదటి షో తర్వాత థియేటర్స్ కి చాలా తక్కువగా రాగా ఏ దశలో కూడా సినిమా బడ్జెట్ కి న్యాయం చేసేలా కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోలేక పోయింది అనే చెప్పాలి.

రిలీజ్ అయిన మొదటి 3 రోజుల వీకెండ్ లో 22 లక్షల గ్రాస్ ని 13 లక్షల షేర్ ని సొంతం చేసుకోగా తర్వాత వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా చేతులు ఎత్తేసిన ఈ సినిమా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం లో 31 లక్షల గ్రాస్ ను 18 లక్షల రేంజ్ లో షేర్ ని…

బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద సొంతం చేసుకున్నట్లు అయింది… సినిమా ను మొత్తం మీద 1.2 కోట్ల రేంజ్ బడ్జెట్ లో నిర్మించగా సినిమా తెలుగు రాష్ట్రాలలో 180 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది. బిజినెస్ ఏమి జరగలేదు కానీ ఓన్ రిలీజ్ గానే ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా బడ్జెట్ ను ఎంతవరకు రికవరీ చేస్తుందో అనుకోగా…

టోటల్ రన్ లో కేవలం 18 లక్షలకే సరిపెట్టుకుని భారీ నష్టాలను మిగిలించింది. ఈ కలెక్షన్స్ లో కూడా డెఫిసిట్ లు అండ్ నెగటివ్ షేర్స్ ని తీయకుండా చెబుతున్న కలెక్షన్స్ కాగా అవి కూడా తీసేస్తే కలెక్షన్స్ 10 లక్షల లోపే ఉండే అవకాశం ఉందని చెప్పాలి. ఓవరాల్ గా ప్రమోషన్స్ ఎన్ని చేసినా కంటెంట్ లేక పొతే జనాలు థియేటర్స్ కి రారని మరోసారి రుజువు అయ్యింది.

Leave a Comment