టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

1.6 కోట్లతో తీస్తే… 120 థియేటర్స్ లో రిలీజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చింది ఇదీ…మెగా హీరోల్లో రికార్డ్!!

మెగా ఫ్యామిలీ నుండి హీరోగా లాంచ్ అయిన కొత్త పవన్ కుమార్ కొణిదల…. ఈ హీరో నటించిన మొదటి సినిమా ఈ కథలో పాత్రలు కల్పితం రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఆ విషయం కూడా చాలా తక్కువ మందికే తెలుసు. మెగా హీరోల్లో ఎవ్వరూ కూడా ఈ సినిమాను ప్రమోట్ చేయలేదు. అయినా కానీ హీరో పవన్ కళ్యాణ్ పేరు ను అలాగే మెగాస్టార్ పేరు ను వాడుకుని సెల్ఫ్ ప్రమోట్ చేసుకున్నా…

కానీ ఆడియన్స్ ఎవ్వరూ కూడా పెద్దగా పట్టించుకోలేదు. సినిమా ను కూడా ఎవ్వరూ చూడలేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద ఈ సినిమాను కొనడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు , దాంతో సినిమాను ఓన్ గానే రిలీజ్ చేయగా సుమారు 1.6 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందిన…

ఈ సినిమా ఓన్ గానే రిలీజ్ ను సొంతం చేసుకోగా… తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు నుండే మినిమమ్ షేర్ ని కూడా సొంతం చేసుకోలేక పోయింది.. టోటల్ రన్ లో ఎలాగోలా 8 లక్షల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకున్న ఈ సినిమా అందులో నెగటివ్ షేర్ ని డెఫిసిట్ లను…

పక్కకు పెడితే జీరో షేర్ నే సొంతం చేసుకుంది అని చెప్పొచ్చు. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 9 లక్షల రేంజ్ షేర్ ని సొంతం చేసుకుని పరుగును ముగించిన ఈ సినిమా 120 థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మినిమమ్ ఖర్చులు కూడా సరిపడా కలెక్షన్స్ ని సాధించలేక పోయింది. మొత్తం మీద బడ్జెట్ పరంగా చూసుకుంటే సినిమా భారీ నష్టాన్ని మిగిలించగా..

సినిమా శాటిలైట్ రైట్స్ అండ్ డిజిటల్ రైట్స్ కలిపి మరో 35 లక్షల దాకా రికవరీ అయ్యిందట. దాంతో అవి పక్కకు పెట్టినా మొత్తం మీద నిర్మాతకి ఈ సినిమా వల్ల 1.1 కోట్లకు పైగానే నష్టం వచ్చింది అని చెప్పాలి. ఒకవేళ మెగా హీరోలు ఎవరైనా ప్రమోట్ చేసి ఉంటె కొంచం ఎక్కువ కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకుని ఉండేది కావొచ్చు.

Leave a Comment