గాసిప్స్ న్యూస్

10 కోట్ల సీనయ్య…షాకింగ్ అప్ డేట్!!

టాలీవుడ్ డైరెక్టర్స్ లో కమర్షియల్ గా సూపర్ సక్సెస్ లను సొంతం చేసుకుని టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా నిలిచిన దర్శకుడు వి వి వినాయక్.. చేసింది తక్కువ సినిమా లే అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాల ను సొంతం చేసు కున్నాడు వినాయక్, ఆది, దిల్, ఠాగూర్, బన్నీ, లక్ష్మీ, కృష్ణ, అదుర్స్ మరియు నాయక్ లాంటి కమర్షియల్ హిట్స్ తో దూసుకు పోతున్న టైం లో..

అల్లుడు శీను, అఖిల్ సినిమాలతో భారీ దెబ్బ తినగా తిరిగి మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 తో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చినట్లే ఇచ్చాడు కానీ తర్వాత వెంటనే సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ తో ఇంటెలిజెంట్ సినిమా తో భారీ డిసాస్టర్ ను అందుకున్నాడు.

వినాయక్ మూవీ స్టైల్ ఓల్డ్ అయిపోయిందని అఖిల్, ఖైదీ నంబర్ 150 లకే టాక్ వినిపించింది కానీ ఒకటి లాంచింగ్ మూవీ అవ్వడం ఒకటి రీ ఎంట్రీ మూవీ అవ్వడం తో మొత్తం తప్పు తన మీద పడలేదు కానీ ఇంటెలిజెంట్ తో అయితే తేలిపోయింది, ఇలాంటి టైం లో డైరెక్టర్ గా కాకుండా…

హీరోగా ఎంట్రీ ఇద్దామని అందరికీ షాక్ ఇచ్చాడు వినాయక్. తాను డైరెక్టర్ గా లాంచ్ అయిన దిల్ రాజు బ్యానర్ నుండే హీరోగా సీనయ్య సినిమా ఎంట్రీ ఇవ్వాలని ఫిక్స్ అవ్వగా ఈ సినిమా కి మొత్తం మీద 10 కోట్ల మేర బడ్జెట్ ని ఖర్చు చేశారట ఇప్పటి వరకు. కానీ రీసెంట్ టైం లో తన దిల్ రాజు భారీ ఆశలు పెట్టుకున్న…

జాను భారీ డిసాస్టర్ అవ్వడం, వకీల్ సాబ్ కి భారీ బడ్జెట్ పెట్టడం లాక్ డౌన్ వలన ఆగిపోవడం తో, తన లైఫ్ లో కూడా జరిగిన కొన్ని పరిణామాల దృశ్యా ఇప్పుడు సీనయ్య షూటింగ్ ఆపేశారని సమాచారం. ఫైనాన్స్ ఇష్యూస్ క్లియర్ అయితే ఫ్యూచర్ లో ఈ ప్రాజెక్ట్ మళ్ళీ స్టార్ట్ చేస్తారని టాక్ ఉంది అది ఎంతవరకు నిజం అవుతుందో అన్నది దిల్ రాజు న్యూ మూవీస్ రిజల్ట్ పై ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు…

Leave a Comment