గాసిప్స్ న్యూస్

10 రోజుల షూటింగ్…టోటల్ స్టూడియో బ్లాక్ చేసిన స్టార్ హీరో!!

కరోనా ఎఫెక్ట్ వలన షూటింగ్ లు తిరిగి స్టార్ట్ చేసుకోవడానికి పర్మీషన్లు అయితే వచ్చినా కానీ స్టార్ హీరోల్లో దాదాపు అందరూ కూడా షూటింగ్ లలో అడుగు పెట్ట డానికి ఏమాత్రం ఇష్టం చూపడం లేదు. టాలీవుడ్ లో అయితే మరి కొన్ని నెలలు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం కనిపిస్తుండగా బాలీవుడ్ లో కార్పోరేట్ కల్చర్ కాబట్టి ప్రొడక్షన్ హౌసెస్ హీరోల పై కొంచం ప్రెజర్ పెట్టె ప్రయత్నం చేస్తున్నా కానీ…

కొందరు మాత్రమె తిరిగి షూటింగ్ లలో పాల్గొనడానికి వస్తున్నారట. ఇక షూటింగ్ ఆల్ మోస్ట్ చివరి స్టేజ్ లో ఉన్న సినిమాలు మాత్రం ఎలాగోలా కంప్లీట్ చేసుకోవాలని చూస్తున్నాయి. వాటిలో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న రాధే సినిమా కూడా ఒకటి. వాంటెడ్ కి సీక్వెల్ లాంటి సినిమా అని…

ఈ సినిమా పై క్రేజ్ భారీగానే ఉండగా సినిమా లాక్ డౌన్ కన్నా ముందు కేవలం 10 రోజుల వర్కింగ్ డేస్ షూటింగ్ మాత్రమె బాలెన్స్ ఉండగా…. ఇప్పుడు అది కంప్లీట్ చేయాలేని హీరో సల్మాన్ ఖానే భావిస్తున్నాడట. దాంతో ఈ కరోనా ఎఫెక్ట్ ఉండకుండా ఉండాలి అని…

ఒక పెద్ద స్టూడియో మొత్తాన్ని అద్దెకి తీసుకున్నారట. స్టూడియో అంటే అక్కడ చాలా సినిమాల షూటింగ్స్ ఒక్కో చోట జరుగుతూ ఉంటాయి, దాంతో కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో టోటల్ స్టూడియో నే అద్దెకి తీసుకుని తక్కువ మంది తోనే సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యారట. టోటల్ స్టూడియో లో కేవలం 20-30 మందితో…

ఎలాంటి ఇబ్బంది లేకుండా షూటింగ్ ని కంప్లీట్ చేయబోతున్నారట. ఉన్న ఆ 20-30 మంది కూడా కచ్చితంగా 3-4 ఫీట్ల దూరంగానే ఉండాలని రూల్ పెట్టారట. ఇలా సేఫ్ గా షూట్ ని కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారు. టోటల్ స్టూడియోనే బుక్ చేశారు అంటే ఈ పది రోజుల షూటింగ్ లొకేషన్ ఖర్చే భారీగా ఉంటుందని అంటున్నారు. ఆ లెక్కలు త్వరలో తేలుతాయి…

Leave a Comment