న్యూస్ బాక్స్ ఆఫీస్

10 వ రోజు కుమ్మేసిన మహర్షి…ఊచకోత ఇది!!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే కలెక్షన్స్ తో దూసుకు పోతుంది, సినిమా 9 రోజుల్లో 79.4 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 వ రోజున ఊచకోత కోసింది. 2 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవడం ఖాయం అనుకోగా సినిమా అనుకున్నట్లే ఆ మార్క్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర 10 వ రోజున సాధించి దుమ్ము లేపింది.

సినిమా 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ గా ఉండగా నైజాం మరియు వైజాగ్ ఏరియాల్లో రాక్ సాలిడ్ గా ఉందని చెప్పాలి. 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల షేర్లను ఒకసారి గమనిస్తే..
Nizam – 0.84Cr Ceeded – 26L UA – 39L Krishna – 13L Guntur – 10L East – 14L West – 11L Nellore – 6L Total – 2.03 Cr(Solid Hold)

ఇక సినిమా 10 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా కూడా మంచి వసూళ్ళ ని సాధించింది… సీడెడ్ అలాగే ఓవర్సీస్ లో అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేసి ఉంటే సినిమా రేంజ్ మరో లెవల్ లో ఉండేది అని చెప్పొచ్చు. ఇక 10 రోజుల ఏరియాల వారి కలెక్షన్స్ వివరాలను మరో ఆర్టికల్ లో అప్ డేట్ చేస్తాం.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!