గాసిప్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

100 కోట్లు ఏంటి సామి…ఇప్పుడు సగం ఔట్!!

ఒక్కో సినిమా కి అత్యంత భారీ రెమ్యునరేషన్ లు తీసుకునే హీరోలు అన్ని ఇండస్ట్రీ లలో ఉన్నారు….. ఇప్పుడు మార్కెట్ ఎక్స్ పాన్షన్ అవ్వడంతో కొందరు హీరోలకు భారీ రెమ్యునరేషన్ వస్తున్నాయి కానీ ముందూ నుండి కూడా రెమ్యునరేషన్ పరంగా బిగ్గెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ అందరి కన్నా కూడా ముందు నిలిచే స్టార్ హీరో అని చెప్పాలి. ప్రతీ సినిమా కి కూడా రికార్డ్ బ్రేకింగ్ రెమ్యునరేషన్…

సూపర్ స్టార్ కి దక్కుతూ ఉంటుందని అంటుంటారు… ఇక ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీ కోసం రజినీకాంత్ ఆల్ టైం రికార్డ్ లెవల్ లో 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారు అని కోలివుడ్ సమాచారం. రజినీ విశ్వాసం డైరెక్టర్ శివ కాంబో లో అన్నాటల్లె సినిమా రూపొందుతుంది.

వచ్చే ఇయర్ లో రాబోతున్న ఈ సినిమా కి గాను సూపర్ స్టార్ ఏకంగా 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారు అని అంటున్నారు. కానీ ఇక్కడ ఒక మార్పు ఉండబోతుందని అంటున్నారు. రీసెంట్ గా కోలివుడ్ నిర్మాతలు అందరూ కలిసి ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. హీరోలు, డైరెక్టర్లు, హీరోయిన్స్ అండ్…

ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే టెక్నీషియన్స్ అందరూ కూడా తమ రెమ్యునరేషన్ ని సగానికి తగ్గించుకోవాలి అని నిర్ణయం తీసుకోగా… ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు కూడా అది వర్తిస్తుందని అని చెబుతున్నారట. దాంతో ప్రస్తుతం సెట్స్ పైన ఉన్న సినిమాలకు కూడా ఈ నిర్ణయం వర్తిస్తుందని అంటున్నారు. దాంతో 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారు అంటున్న రజినీ కి అందులో సగం ఇప్పుడు తిరిగి ఇచ్చేయాల్సి వస్తుందని అంటున్నారు.

అంటే ఇప్పుడు కూడా రజినీ సినిమా కి 50 కోట్ల రేంజ్ రెమ్యునరేషన్ దక్కుతుంది… అది కూడా చాలా పెద్ద అమౌంట్ అనే చెప్పాలి. రజినీ సినిమాలు అంటే తమిళ్ తెలుగు, హిందీ లో కూడా బిజినెస్ సాలిడ్ గా అవుతాయి. ఇక ఓవర్సీస్ ఎలాగూ దుమ్ము లేపుతుంది కాబట్టే ఈ రేంజ్ రెమ్యునరేషన్ దక్కుతుందని అంటున్నారు కానీ రీసెంట్ టైం లో కొన్ని సినిమాలు అండర్ పెర్ఫార్మ్ చేసినా ఈ రేంజ్ రెమ్యునరేషన్ అంటే రజినీకాంత్ మాస్ అనే చెప్పాలి…

Leave a Comment