న్యూస్ బాక్స్ ఆఫీస్

100 కోట్లు ఔట్…..మాస్ జాతర అంటే ఇదే!!

బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ పెద్దన్న రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం అంచనాలను అందుకోలేకపోతున్న విషయం తెలిసిందే, సినిమా ఇతర రజినీకాంత్ మూవీస్ తో పోల్చితే ఆశించిన కలెక్షన్స్ ని తెలుగు లో సొంతం చేసుకోలేదు, భారీగా థియేటర్స్ ఉన్నప్పటికీ కూడా జనాలను థియేటర్స్ కి రప్పించే విషయంలో తీవ్రంగా నిరాశ పరిచింది ఈ సినిమా, ఇదే టైం లో సినిమా ఇప్పుడు తమిళనాడులో…

సెన్సేషనల్ కలెక్షన్స్ తో హోల్డ్ చేసి దుమ్ము లేపే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది, రెండు రోజుల్లో అక్కడ 44.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా మూడో రోజు కూడా ఆల్ మోస్ట్ 17 కోట్ల రేంజ్ లో…

కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా రెండు రోజుల్లో టోటల్ గా 78.4 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకున్న ఈ సినిమా మూడో రోజు వరల్డ్ వైడ్ గా ఆల్ మోస్ట్ 19-20 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని అంటున్నారు… ఈ కలెక్షన్స్ తో సినిమా…

ఇప్పుడు 100 కోట్ల కి చేరువ అయ్యే అవకాశం ఉండగా నాలుగో రోజు మార్నింగ్ షోల టైం కే బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 100 కోట్ల మార్క్ ని అందుకోబోతుందని చెప్పొచ్చు. సినిమా కి వచ్చిన టాక్ కి ఇవి ఓవరాల్ గా ఊహకందని కలెక్షన్స్ అనే చెప్పాలి. అది కూడా 50% ఆక్యుపెన్సీ తో తమిళనాడులో సినిమా ఊహకందని ట్రెండ్ ని చూపెడుతూ….

దూసుకు పోతూ ఉండగా రజినీ కెరీర్ లో మరో 100 కోట్ల సినిమాగా నిలిచిన ఈ సినిమా సెకెండ్ వేవ్ తర్వాత ఇండియాలో ఫాస్టెస్ట్ 100 కోట్ల మార్క్ ని అందుకున్న సినిమాగా నిలవడమే కాదు ఈ రోజు కలెక్షన్స్ తో ఇండియాలో సెకెండ్ వేవ్ తర్వాత హైయెస్ట్ కలెక్షన్స్ తో ఆల్ టైం రికార్డ్ కొట్టబోతుంది. ఈ మాస్ జాతర వర్కింగ్ డేస్ లో కొనసాగితే సినిమా మరిన్ని సంచలనాలు నమోదు చేసే అవకాశం ఉంది.

Leave a Comment