న్యూస్ బాక్స్ ఆఫీస్

100 కోట్ల బడ్జెట్….కురుక్షేత్రం 3 రోజుల(కర్ణాటక & తెలుగు)కలెక్షన్స్ రిపోర్ట్!!

ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ హంగులతో కన్నడలో కనివినీ ఎరగని విధంగా 100 కోట్ల వరకు బడ్జెట్ తో 3డి లో తెరకెక్కిన సెన్సేషనల్ మైతలాజికల్ మూవీ కురుక్షేత్ర, భారీ హంగులతో తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది, కన్నడ తో పాటు తెలుగు లో కూడా సినిమా ను భారీ ఎత్తున రిలీజ్ చేశారు కానీ పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలు చేయక పోవడం తో మౌత్ టాక్ తోనే కలెక్షన్స్ వచ్చాయి.

కాగా సినిమా కన్నడ నాట భారీ రికార్డులను నమోదు చేస్తుంది అనుకున్నా అక్కడ వచ్చిన భారీ వర్షాల దెబ్బ కి ఈ సినిమా కలెక్షన్స్ పై ఇంపాక్ట్ పడింది. అయినా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అక్కడ సాలిడ్ కలెక్షన్స్ ని అందుకున్నట్లు సమాచారం.

అఫీషియల్ లెక్కలు తేలాల్సి ఉండగా ట్రేడ్ లెక్కల ప్రకారం సినిమా కర్ణాటక కలెక్షన్స్ ని రోజు వారి గమనిస్తే..
Day 1 – 8.6Cr,  Day 2 – 7.6Cr, Day 3 – 8.95Cr, Weekend -25.15Cr~(gross) ని వసూల్ చేసిందట సినిమా అందులో షేర్ 13 కోట్ల వరకు ఉంటుందట. వరల్డ్ వైడ్ గ్రాస్ కన్నడ వర్షన్ కి గాను 28 కోట్ల దాకా ఉంటుందని అంచనా..

అందులో టోటల్ షేర్ షేర్ 14.5 కోట్ల వరకు ఉంటుందట. ఇక బిజినెస్ పూర్తి లెక్కలు తేలాల్సి ఉండగా లేటెస్ట్ గా వినిపిస్తున్న న్యూస్ ప్రకారం అక్కడ వర్షాల వలన బిజినెస్ మారి 45 కోట్ల దాకా ఉందని సమాచారం. ఇక తెలుగు వర్షన్ విషయానికి వస్తే సినిమా మొత్తం మీద…

Day 1 – 45L, Day 2 – 32L, Day 3 – 40L, Weekend – 1.17Cr(Share)దాకా షేర్ ని అందుకుందట సినిమా, ఇక్కడ కూడా సినిమా బిజినెస్ లెక్కలు తేలాల్సి ఉండగా ట్రేడ్ లో వినిపిస్తున్న లెక్క ప్రకారం బిజినెస్ 2.5 కోట్ల వరకు ఉంటుందని అంచనా… ఇక లాంగ్ రన్ లో సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!