న్యూస్ బాక్స్ ఆఫీస్

100 కోట్ల సినిమా..తెలుగు-కన్నడ లో ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసిందో తెలిస్తే షాక్!!

కన్నడలో ఎంతో ప్రతిష్టాత్మకంగా సుమారు 100 కోట్ల రేంజ్ బడ్జెట్ తో భారీ ఎత్తున తెరకెక్కిన మైతలాజికల్ మూవీ కురుక్షేత్ర బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పరంగా అక్కడ భారీ వర్షాలు ఎదురుదెబ్బ కొడుతున్నా కానీ సాలిడ్ కలెక్షన్స్ ని సాదిస్తున్నయట. కానీ తెలుగు రాష్ట్రాలలో మాత్రం సినిమా ను సరిగ్గా ప్రమోట్ చేయలేక పోయారు. ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ పడినా ఇక్కడ ఉన్నతలో మౌత్ టాక్ తో సినిమా బాగానే వసూల్ చేసింది.

ఓవరాల్ గా కర్ణాటక లో సినిమా నిర్మాతల లెక్కల్లో ఇప్పటి వరకు 60 కోట్ల వరకు గ్రాస్ ని వసూల్ చేసిందని చెబుతున్నారు. ట్రేడ్ లెక్కల్లో ఇది 45 కోట్ల రేంజ్ లో ఉందని సమాచారం. ఓవరాల్ గా నిర్మాతల లెక్కల ప్రకారమే సినిమా షేర్ 32 కోట్లకు పైగా ఉంటుందని అంటున్నారు.

కాగా సినిమా బిజినెస్ అక్కడ వర్షాల ఎఫెక్ట్ వలన తగ్గి మొత్తం మీద 45 కోట్ల వరకు జరిగిందని సమాచారం, ఆ లెక్కన సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి మరో 13 కోట్ల వరకు షేర్ ని అధికంగా వసూల్ చేయాల్సి ఉంటుంది. ఇక తెలుగు లో సినిమా బిజినెస్ 2.5 కోట్ల రేంజ్ లో జరిగినట్లు సమాచారం.

కాగా సినిమా ఇప్పటి వరకు ఇక్కడ 1.54 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుందట, కానీ చాలా ఏరియాల్లో సినిమా పరుగు ఫైనల్ కి వచ్చిందని సమాచారం, దాంతో మరో 10 నుండి 15 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ పరుగును ముగించవచ్చు. ఓవరాల్ గా తెలుగు లాస్ 80 లక్షల లోపే ఉంటుంది.

ఇక ఓవర్సీస్ లో 1.5 కోట్ల వరకు గ్రాస్ ని, తమిళ్ లో 20 లక్షల దాకా గ్రాస్ ని అందుకుందట. టోటల్ గా అన్ని భాషల్లో కలిపి 65 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుందట ఈ సినిమా, షేర్ 35 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా.. మరి ఫైనల్ రన్ లో ఎంత దూరం వెళుతుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment