న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

100 వ తో 260…యావరేజ్ టాక్ తో కెరీర్ బెస్ట్ రికార్డ్!!

ప్రతీ హీరో కి కెరీర్ లో కొన్ని మైలు రాయి సినిమాలు ఉంటాయి, ఒకప్పుడు హీరోల సినిమాల కౌంట్ ఇయర్ ఇయర్ కి 5 నుండి 10ల సంఖ్య కి చేరుకునేవి, దాంతో 50, 100, 200 ఇలా హీరోల సినిమాల కౌంట్ ఉండేది, కానీ ఇప్పుడు హీరోలు ఇయర్ కి ఒకటి 2 సినిమాలు చేస్తూ 25 వ సినిమా 50 వ సినిమాకే గొప్ప అనిపించుకుంటున్నారు. బాలీవుడ్ లో ఈ నంబర్స్ కి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వరు కానీ…

రీసెంట్ గా కెరీర్ లో 100 వ సినిమా ను పూర్తీ చేసుకున్నాడు సీనియర్ హీరో అజయ్ దేవగన్, ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర తనకంటూ భారీ మార్కెట్ ని సొంతం చేసుకున్న ఈ హీరో తన 100 వ సినిమా ను భారీ ఎత్తున 150 కోట్ల రేంజ్ బడ్జెట్ తో….

“తానాజీ” ది అన్ సంగ్ వారియర్ అంటూ హిస్టారికల్ నేపధ్యంలో 3D లో సినిమాను తెరకెక్కించాడు. కాగా సినిమా జనవరి 10 న రిలీజ్ అవ్వగా సినిమా బాలీవుడ్ లో 3 స్టార్ రేటింగ్స్ లభించగా జనరల్ ఆడియన్స్ మాత్రం ఇలాంటి హిస్టారికల్ మూవీస్ చూసి ఉన్నారు కాబట్టి పర్వాలేదు బాగుంది సినిమా అన్న రేంజ్ లో టాక్ చెప్పారు.

కానీ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకు పోగా కొత్త సినిమా లు రిలీజ్ అయినా కానీ ఎక్కడా జోరు తగ్గకుండా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఇప్పటి వరకు సాధించిన వసూళ్ళ తో 260 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుంది.

లాంగ్ రన్ లో మరో 10 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవచ్చని టాక్, ఇక వరల్డ్ వైడ్ గా 380 కోట్ల రేంజ్ గ్రాస్ ని అందుకుందట సినిమా, జనాల్లో యావరేజ్ టాక్ ఉన్నా 100 వ సినిమా తో కెరీర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్ ని సొంతం చేసుకుని తిరిగు లేని మైలురాయి ని సొంతం చేసుకున్నాడు హీరో అజయ్ దేవగన్.. సినిమా 150 కోట్ల నెట్ కలెక్షన్స్ టార్గెట్ కి ఇప్పటికే 110 కోట్లకు పైగా ప్రాఫిట్ ని సొంతం చేసుకుంది.

Leave a Comment