న్యూస్

100K-200K లైక్స్…ఏంటి సామి ఇంత షాకిచ్చారు!!

పాన్ ఇండియా సెన్సేషన్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ రాధే శ్యామ్ సినిమా అఫీషియల్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి కి రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అఫీషియల్ టీసర్ ను రీసెంట్ గా ప్రభాస్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేశారు. ఇక టీసర్ కి ఓవరాల్ గా రెస్పాన్స్ అదిరిపోయే విధంగా ఉన్నప్పటికీ రిలీజ్ కి ముందే సినిమా టీసర్ ఆన్ లైన్ లో…

లీక్ అవ్వడంతో ఆ ఇంపాక్ట్ ఇనీషియల్ రికార్డుల పై ఎఫెక్ట్ చూపింది. రెండు ఛానెల్స్ లో 10:59:12 టైం కి రిలీజ్ అయిన రాధే శ్యామ్ టీసర్ యు వి ఛానెల్ లో 50 వేల లైక్స్ ని అందుకోవడానికి 12 నిమిషాల టైం తీసుకోగా 1 లక్ష లైక్స్ ని అందుకోవడానికి….

22 నిమిషాల 52 సెకన్ల టైం తీసుకుంది. దాంతో ఫాస్టెస్ట్ 50 వేలు, 1 లక్ష లైక్స్ రికార్డ్ ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ పేరిట అలానే కొనసాగుతూ ఉంది, ఇక 2 లక్షల లైక్స్ విషయంలో అయినా రాధే శ్యామ్ పుంజుకుంటుంది అనుకుంటే 64 నిమిషాల టైం తీసుకుని 2 లక్షల లైక్స్ ని కంప్లీట్ చేసింది.

దాంతో 2 లక్షల లైక్స్ రికార్డ్ కూడా ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ 18 నిమిషాల పేరిట ఉంది… ఇక T సిరీస్ ఛానెల్ లో 1 గంటలో 1 లక్ష లైక్స్ ని అందుకోగా అక్కడ 1 మిలియన్ రియల్ టైం వ్యూస్ ని అందుకుందని సమాచారం. ఇక యు వి క్రియేట్ ఛానెల్ లో ఆల్ మోస్ట్ 2 మిలియన్స్ కి పైగా వ్యూస్ రిజిస్టర్ అయ్యాయని చెప్పొచ్చు.

ఓవరాల్ గా మొదటి గంట టైం లో ఆల్ మోస్ట్ 3 మిలియన్ కి పైగా రియల్ టైం వ్యూస్ 3 లక్షల రేంజ్ లో ఓవరాల్ లైక్స్ ని అందుకుందని చెప్పొచ్చు. ఇనీషియల్ రికార్డులకు లీక్ ఎఫెక్ట్ తో షాక్ తగిలినా 24 గంటలు పూర్తీ అయ్యే టైం కి రికార్డులు నమోదు చేసే అవకాశం ఇంకా ఉందని చెప్పొచ్చు. మరి 24 గంటల రిపోర్ట్ ఎలా ఉంటుందో చూడాలి ఇక..

Leave a Comment