న్యూస్ బాక్స్ ఆఫీస్

11 కోట్లు ఔట్ అక్కడా….10 రోజుల్లో ఊరమాస్ కలెక్షన్స్!

చిన్న సినిమా పెళ్లి సందD బాక్స్ ఆఫీస్ దగ్గర డ్రీం రన్ లో ఉంది, సినిమా రిలీజ్ అయినప్పుడు ఎవ్వరూ ఈ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది అన్ని ఎక్స్ పెర్ట్ చేయలేదు కానీ వీకెండ్ వరకు కుమ్మిన తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా సూపర్ స్టడీగా కలెక్షన్స్ ని అందుకుంటూ దూసుకు పోతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం తర్వాత ఇప్పుడు రెండో వారంలో…

ఎంటర్ అవ్వగా రెండో వీకెండ్ లో ఓవరాల్ గా సూపర్ సాలిడ్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకుని క్లీన్ హిట్ నుండి ఇప్పుడు సూపర్ హిట్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా 10 వ రోజు క్రికెట్ మ్యాచ్ ఉన్నప్పటికీ కూడా గ్రోత్ చూపెట్టి సాలిడ్ హోల్డ్ ని సాధించి….

బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గ్రాస్ 11 కోట్ల మార్క్ ని అధిగమించింది… సినిమా 10 వ రోజు తెలుగు రాష్ట్రాలలో 46 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది…. దాంతో ఇప్పుడు టోటల్ వరల్డ్ వైడ్ గా 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి…

👉Nizam: 1.88Cr
👉Ceeded: 1.38Cr
👉UA: 92L
👉East: 46L
👉West: 37L
👉Guntur: 58L
👉Krishna: 41L
👉Nellore: 31L
AP-TG Total:- 6.32CR(10.35CR~ Gross)
Ka+ROI: 28L
OS – 8L
Total WW: 6.68CR(11CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజుల్లో సాధించిన ఓవరాల్ కలెక్షన్స్ లెక్క…

సినిమాను మొత్తం మీద 5.5 కోట్లకు అమ్మగా సినిమా 6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా 10 రోజులలో సాధించిన కలెక్షన్స్ తో మొత్తం మీద 68 లక్షల ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు సినిమా హిట్ నుండి సూపర్ హిట్ దిశగా వెళుతుంది అని చెప్పాలి.

Leave a Comment