న్యూస్ బాక్స్ ఆఫీస్

11 రోజులు 1636 కోట్లు….మాస్ భీభత్సం ఇదీ!

సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన ఆల్ మోస్ట్ మళ్ళీ అన్ని చోట్ల కూడా ఇబ్బందులు అలానే కొనసాగుతూ ఉండగా ఇండియా లో థియేటర్స్ తెరచుకోవడానికి ఇంకా టైం పట్టేలా ఉండగా మరో పక్క ఓవర్సీస్ మార్కెట్ కూడా చాలా వరకు కోలుకోవాల్సి ఉంది. మరో పక్క చైనా మాత్రం పరిస్థితులు లాస్ట్ ఇయరే నార్మల్ అవ్వగా అక్కడ హాలీవుడ్ మూవీస్ క్రమం తప్పకుండా రిలీజ్ అవుతూ బాక్స్ ఆఫీస్ ను సాలిడ్ గా షేక్ చేస్తున్నాయి.

ఇక రీసెంట్ టైం లో అక్కడ భారీ లెవల్ లో రిలీజ్ అయిన మోస్ట్ అవైటెడ్ మూవీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 సినిమా హాలీవుడ్ రిలీజ్ ఇంకా కాకుండానే చైనా లో కొన్ని ఇతర చోట్ల భీభత్సమైన కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ మొదటి వీకెండ్ 4 రోజుల్లోనే…

ఆల్ మోస్ట్ 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు 11 రోజులు పూర్తీ అయిన తర్వాత ఈ లెక్క ఇంకా పెరిగి జోరు అలానే కొనసాగుతూ ఉండటం విశేషం. సినిమా చైనాలో 185 మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేయగా మిగిలిన ఓవర్సీస్ కొన్ని లోకేషన్స్ లో కలిపి…

టోటల్ గా 227 మిలియన్స్ కి పైగా డాలర్స్ ని 11 రోజుల్లో సొంతం చేసుకుందని సమాచారం. అంటే ఇండియన్ కరెన్సీ లో ఈ లెక్క మొత్తం మీద 1636 కోట్ల దాకా ఉంటుందని చెప్పొచ్చు. ఈ రేంజ్ కలెక్షన్స్ ని కేవలం 11 రోజుల్లో ఆసియా దేశాల్లోనే సినిమా సొంతం చేసుకోవడం అంటే మామూలు భీభత్సం కాదనే చెప్పాలి. ఇంకా అమెరికాలో…

అలాగే పరిస్థితులు బాగుంటే ఇండియా రిలీజ్ జూన్ ఎండ్ కి ఉండే అవకాశం ఉంది, అప్పటి వరకు ఈ సినిమా ఇలానే కలెక్షన్స్ సాధిస్తూ పొతే తర్వాత అమెరికా కలెక్షన్స్ తో మరో లెవల్ భీభత్సం సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో సినిమా ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి ఇక…

Leave a Comment