న్యూస్ బాక్స్ ఆఫీస్

11 వ రోజు 2.2 కోట్లు అనుకుంటే వచ్చింది ఇది!!

మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ లో తిరిగి జోరు చూపుతున్నాడు, సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన చోట్ల ఎలా ఉన్నా కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం సాలిడ్ గా హోల్డ్ చేసి దుమ్ము లేపింది, సినిమా 9 మరియు 10 రోజుల్లో కొంచం తగ్గినా 11 వ రోజు శనివారం అవ్వడం తో జోరు భారీ గానే చూపి అనుకున్న అంచనాలను కూడా మించి వసూళ్ళని సాధించింది.

సినిమా 11 వ రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల డ్రాప్స్ కేవలం 5% లోపు మాత్రమె ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోల కి వచ్చే సరికి గ్రోత్ ఆల్ మోస్ట్ 15% కి పైగా ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో పెరగగా సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కూడా దుమ్ము లేపింది.

దాంతో సినిమా 11 వ రోజు అవలీలగా 2.2 కోట్ల నుండి 2.3 కోట్ల రేంజ్ షేర్ పక్కా అనుకోగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్నట్లు ఉంటె 2.5 కోట్ల రేంజ్ కి మించే అవకాశం ఉందని భావించగా సినిమా ఫైనల్ గా 2.73 కోట్ల షేర్ ని 11 వ రోజు అందుకుని దుమ్ము లేపే రేంజ్ లో హోల్డ్ చేసింది.

11 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో సైరా సాధించిన ఏరియాల వారి షేర్స్ ఈ విధంగా ఉన్నాయి.
?Nizam: 1.12Cr
?Ceeded: 48L
?UA: 48L
?East: 16L
?West: 11.6L
?Guntur: 15L
?Krishna: 14L
?Nellore: 8L
AP-TG Day 11:- 2.73Cr ఇదీ మొత్తం మీద 11 వ రోజు సినిమా సాధించిన కలెక్షన్స్ జోరు…

నైజాం లో మరోసారి కోటి కి పైగా షేర్ తో దుమ్ము లేపిన సినిమా సీడెడ్ అండ్ వైజాగ్ లో సూపర్ స్ట్రాంగ్ గా నిలిచింది. ఇక ఈ రోజు ఆదివారం అవ్వడం తో సినిమా రెట్టించిన జోరు చూపే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు. ఇక 11 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వివరాలను మరో ఆర్టికల్ లో అప్ డేట్ చేస్తాం.

Leave a Comment