న్యూస్ బాక్స్ ఆఫీస్

110 థియేటర్స్ లో రిలీజ్..వి మూవీ టోటల్ కలెక్షన్స్….షాక్ కొట్టిందిగా!

నాచురల్ స్టార్ నాని కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమాగా రూపొందిన సినిమా వి ది మూవీ, సుదీర్ బాబు కీలక పాత్ర చేసిన ఈ సినిమా లాస్ట్ ఇయర్ సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సిన సినిమా కానీ పరిస్థితుల వలన రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ డైరెక్ట్ రిలీజ్ వైపు అడుగులు వేయాల్సి వచ్చింది. డైరెక్ట్ రిలీజ్ తర్వాత సినిమా కి పెద్దగా పాజిటివ్ టాక్ అయితే రాలేదు కానీ అమెజాన్ ప్రైమ్ వాళ్లకి…

సినిమా ద్వారా మంచి వ్యూస్ దక్కాయి అని చెప్పాలి. ఇక డిజిటల్ రిలీజ్ తర్వాత సినిమా టెలివిజన్ లో ప్రీమియర్స్ ని కూడా జరుపుకుంది. సినిమా టెలివిజన్ లో యావరేజ్ లెవల్ లోనే TRP రేటింగ్ లను సొంతం చేసుకోగా టెలివిజన్ ప్రీమియర్ తర్వాత సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వాలని డిసైడ్ అవ్వగా జనవరి 1 న ప్రేక్షకుల ముందుకు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 110 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోగా మొత్తం మీద సంక్రాంతి సినిమాలు వచ్చే వరకు పరుగును కొనసాగించిన ఈ సినిమా…

పరుగును త్వరగానే పూర్తీ చేసుకున్నా రెండు తెలుగు రాష్ట్రాలలో డీసెంట్ కలెక్షన్స్ తో రన్ ని కంప్లీట్ చేసుకుంది. సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 16 లక్షల దాకా షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకోగా గ్రాస్ 25 లక్షల దాకా సొంతం అయినట్లు సమాచారం. ఇవి డీసెంట్ కలెక్షన్స్ అనే చెప్పాలి. సినిమా ను నిర్మాతలు పర్సంటేజ్ బేస్ మీద బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ చేశారు…

అంటే వచ్చిన టోటల్ షేర్ ని థియేటర్ ఓనర్లు మరియు నిర్మాతలు పంచుకుంటారు అన్న మాట. ఆ లెక్కన బిజినెస్ కూడా లేకపోవడం తో మొత్తం మీద వచ్చిన కలెక్షన్స్ పంచుకున్నారు. దాంతో కంప్లీట్ గా డిజిటల్, టెలివిజన్, థియేట్రికల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా..

Leave a Comment