న్యూస్ ప్రీ రిలీజ్ బిజినెస్ బాక్స్ ఆఫీస్

12 ఏళ్ల తర్వాత తమిళ్ లో డబ్, బిజినెస్ & థియేటర్స్ కౌంట్ ఇదే!!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి ల కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాల్లో యమదొంగ స్పెషల్ అని చెప్పొచ్చు. టాలీవుడ్ లో సోషియో ఫాంటసీ అండ్ పౌరాణిక టచ్ తో దుమ్ము లేపిన సినిమా ఇది. రిలీజ్ అయ్యి దాదాపు 12 ఏళ్ళు పూర్తీ అవుతున్న ఈ సినిమా ఇప్పుడు తమిళ్ లో డబ్ అయ్యి రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. ఈ సినిమా ను అక్కడ…

సింగిల్ స్క్రీన్స్ లో భారీ గానే రిలీజ్ చేస్తున్నారు. కాగా కోలివుడ్ సర్కిల్స్ నుండి వినిపిస్తున్న టాక్ ప్రకారం సుమారు 90 థియేటర్స్ లో అలాగే సుమారు 130 కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ కి సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇక సినిమా బిజినెస్ అక్కడ పర్వాలేదు అనిపించే విధంగా జరిగింది.

సినిమా ను సుమారు అక్కడ 35 లక్షల రేంజ్ లో అమ్మారు. దాంతో ఇప్పుడు సినిమా అక్కడ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే సుమారు 65 లక్షల దాకా గ్రాస్ ని మినిమం వసూల్ చేస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఎన్టీఆర్ కెరీర్ లో మొదటి సారిగా…

ఒక సినిమా తమిళ్ లో డబ్ అవ్వడం ఇదే మొదటి సారి, రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ తో కలిసి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా వచ్చే ఇయర్ రిలీజ్ కానున్న నేపధ్యంలో ఇది కచ్చితంగా ట్రైల్ మ్యాచ్ లా ఉంటుందని చెప్పొచ్చు. సినిమా అక్కడ మినిమం ఇంపాక్ట్ చూపినా కానీ.. అది ఆర్.ఆర్.ఆర్ సినిమా కి మరింత హెల్ప్ అవుతుంది.

దాంతో పాటే మార్కెట్ ఎక్స్ పాన్షన్ పరంగా ఎన్టీఆర్ కూడా హెల్ప్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక 12 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు తమిళ్ ఆడియన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటుంది, ఎంతవరకు కలెక్షన్స్ ని అందుకోగలుగుతుంది అన్నది కొన్ని రోజుల్లో తేలనుంది అని చెప్పాలి.

Leave a Comment