గాసిప్స్ న్యూస్

12 కాన్సిల్ అంట…ఇది వదులుకుంటే కష్టమే ఇక!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ 2019 ఇయర్ లో ఇస్మార్ట్ శంకర్ సినిమా తో సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చిన విషయం తెలిసిందే, బాక్స్ ఆఫీస్ దగ్గర ఊరమాస్ హిట్ ని సొంతం చేసుకుని కెరీర్ లో మొదటి 40 కోట్ల మార్క్ ని అందుకున్న సినిమా తో రెచ్చిపోయిన రామ్ తర్వాత ఇప్పుడు తమిళ్ బ్లాక్ బస్టర్ తడం తెలుగు రీమేక్ రెడ్ మూవీ తో త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతుండగా రామ్ చేస్తున్న అప్ కమింగ్….

మూవీ గురించిన ఎలాంటి న్యూస్ కూడా ఇప్పటి వరకు అఫీషియల్ గా అయితే కన్ఫాం కాలేదు. కాగా ఆ డైరెక్టర్ తో ఈ డైరెక్టర్ తో అంటూ వార్తలు అయితే వచ్చాయి కానీ ఏవి కూడా కన్ఫాం కాలేదు. కాగా ఇప్పుడు మొత్తం మీద లాక్ డౌన్ లో…

రామ్ ఎన్ని కథలను విన్నారు అన్న న్యూస్ బయటికి వచ్చింది, నోటబుల్ డైరెక్టర్స్ అందరూ కూడా రామ్ కి తమ కథలను వినిపించగా మొత్తంగా రామ్ 12 కథలను ఈ కరోనా టైం లో విని వద్దూ అని చెప్పారట. కథలు కంప్లీట్ గా నచ్చక కొన్ని మార్పులు కోరుతూ కొన్ని…

రిజక్ట్ చేసిన రామ్ ఫైనల్ గా ఏ కథని కూడా హోల్డ్ లో కూడా పెట్టలేదట. ఇక ఈ కథలు అన్నీ ఒకెత్తు ఇప్పుడు తన కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ మరో ఎత్తుగా చెప్పుకోవచ్చు. వీరి కాంబినేషన్ లో సినిమా పై గట్టి వార్తలు వస్తున్నా అఫీషియల్ గా…

కన్ఫాం అయితే కాలేదు కానీ, టాలీవుడ్ న్యూస్ ప్రకారం రామ్ కి త్రివిక్రమ్ ఒక కథ పాయింట్ ని చెప్పగా రామ్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది, ఈ ప్రాజెక్ట్ కనుక ఓకే అయ్యి తక్కువ టైం లో కంప్లీట్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే రామ్ కెరీర్ కి బిగ్గెస్ట్ బూస్టప్ ఇస్తుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. మరి రామ్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి.

Leave a Comment