న్యూస్ స్పెషల్

135 కోట్ల సినిమా…అక్కడ ఎదురుదెబ్బ పడినా వరల్డ్ లో నం4 అంట…ఎలానో తెలుసా?

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది, కెరీర్ లో ఒకప్పుడు వరుస పెట్టి విజయాలతో దూసుకు పోయిన షారుఖ్ ఖాన్ లాస్ట్ హిట్ కొట్టి ఆల్ మోస్ట్ 7 ఏళ్ల పైనే అవుతుంది, ఇక షారుఖ్ ఖాన్ నటించిన లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యి కూడా ఆల్ మోస్ట్ 3 ఏళ్ళు అవుతుంది, ఇలాంటి టైం లో ఒక ఓల్డ్ మూవీ తో యూనిక్ రికార్డ్ ను…

కింగ్ ఖాన్ సొంతం చేసుకోవడం ఇప్పుడు బాలీవుడ్ లో టాక్ ఆఫ్ టౌన్ గా నిలిచింది, షారుఖ్ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నప్పటికీ కూడా 2017 లో ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల నడుమ వచ్చిన రేయిస్ సినిమా అంచనాలను అందుకోలేక పోయినా…

టోటల్ రన్ లో 135 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ ని ఇండియా లో సొంతం చేసుకుని యావరేజ్ అనిపించుకుంది, అయితేనేం ఇదే సినిమా ఇప్పుడు ఇండియా తరుపున నంబర్ 1 గా అలాగే వరల్డ్ వైడ్ గా నంబర్ 4 ప్లేస్ ను యూట్యూబ్ లో వరల్డ్ వైడ్ గా ఎవ్వరి ఊహలకు అందని విధంగా…

అత్యధిక పెయిడ్ వ్యూస్ ని సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించింది, అంటే సినిమా ని యూట్యూబ్ లో చూడటానికి అత్యధిక మంది జనాలు ప్రీమియం రేటు చెల్లించి సినిమాని చూశారు. వరల్డ్ వైడ్ మూవీస్ లో ఈ సినిమా 4 వ ప్లేస్ ను సొంతం చేసుకుని టాప్ 5 లో నిలిచిన ఒకే ఒక్క ఇండియన్ మూవీ గా రికార్డ్ సృష్టించింది.

బాలీవుడ్ లో ఎన్నో హిట్ మూవీస్ కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ లు ఉన్నప్పటికీ ఈ సినిమా అల్టిమేట్ రికార్డ్ ను సొంతం చేసుకోవడం షారుఖ్ మాస్ పవర్ కి నిదర్శనం అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో షారుఖ్ ఖాన్ అప్ కమింగ్ మూవీ మాస్ కంబ్యాక్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు, ఇయర్ ఎండ్ లో కానీ వచ్చే ఇయర్ లో కానీ షారుఖ్ కొత్త సినిమా పఠాన్ రిలీజ్ కాబోతుంది.

Leave a Comment