న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

14 సార్లు 100 కోట్లు…ఏ హీరో దరిదాపుల్లో కూడా లేడు!

ఇండియన్ సినిమా హిస్టరీ లోనే ఇదో చారిత్రిక రికార్డ్ గా నిలిచిపోతుంది అని చెప్పొచ్చు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన సినిమాలు ఎక్కువ గా 100 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని మినిమం అందుకుని ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేశాయి. అవి కూడా వరుసగా 14 సార్లు మినిమం 100 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోవడం అంటే మామూలు రికార్డ్ కాదు. కానీ ఈ రికార్డ్ ను సాధించి సల్మాన్ ఖాన్ చరిత్ర సృష్టించాడు.

దబాంగ్ సినిమా తో మొదలైన ఈ రికార్డుల పరంపర… రెడీ, బాిడీగార్డ్, కిక్, జైహో, ఏక్ థా టైగర్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, దబంగ్-2, భజరంగి భాయిజాన్, సుల్తాన్, ట్యూబ్ లైట్, టైగర్ జిందా హై, రేస్-3 ఇప్పుడు రిలీజ్ అయిన భారత్ వరకు కంటిన్యు గా కొనసాగింది, బాలీవుడ్ చరిత్ర లోనే కాదు…

ఇండియన్ సినిమా హిస్టరీ లో కూడా ఇలాంటి ఊహకందని రికార్డ్ ను నమోదు చేసిన హీరో మరొకరు లేరు, అది కూడా వరుసగా అందుకున్న హీరో లేరనే చెప్పాలి. ఈ లిస్టులో జై హో, ట్యూబ్ లైట్, మరియు రేస్ 3 సినిమాలు ఫ్లాఫ్ టాక్ తోనూ సంచలనం సృష్టించాయి. ఇప్పట్లో ఈ రికార్డుల వెల్లువ ఆగే అవకాశం కూడా లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!