గాసిప్స్ న్యూస్

140 కోట్ల బ్లాక్ బస్టర్ సినిమా…తెలుగు రీమేక్ ని ఆపేశారా!!

ఒక భాషలో హిట్ అయిన మూవీస్ ని మరో భాషలో రీమేక్ చేయడం అన్నది కామన్ గా జరుగుతూ ఉంటుంది, ఈ మద్య ఎక్కువగా సౌత్ మూవీస్ బాలీవుడ్ లో రీమేక్ లు అనౌన్స్ మెంట్ లు జరుగుతున్న విషయం తెలిసిందే, కానీ అక్కడ నుండి ఇక్కడ రీమేక్ అవ్వాల్సిన సినిమాలు చాలా లేట్ గా మొదలు అవుతూ ఉన్నాయి, లేటెస్ట్ గా ఈ కోవలోకే ఓ క్రేజీ మూవీ కూడా ఉందని చెప్పాలి.

లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకున్న ఆయుష్మాన్ ఖురానా నటించిన డ్రీమ్ గర్ల్ బాక్స్ ఆఫీస్ దగ్గర 140 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని వసూల్ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేయగా ఈ సినిమాను తెలుగు లో రీమేక్ హక్కులను…

అప్పుడే తీసుకున్నారు… తెలుగు లో ఈ సినిమాకి ఎవరు బాగా సెట్ అవుతారు అంటూ వెతికి చివరికి రాజ్ తరుణ్ ని ఎంచుకోగా… ఈ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకోవచ్చు అని రాజ్ తరుణ్ కూడా భావించాడు, ఇంతలో కరోనా ఎంటర్ అవ్వడం తో ఈ సినిమా డిలే అవుతూ రాగా…

ఈ గ్యాప్ లో రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా ని డైరెక్ట్ రిలీజ్ చేయగా కొత్తగా మరో 3 సినిమాలు రీసెంట్ గా కమిట్ అయ్యాడు, దాంతో ఈ బ్లాక్ బస్టర్ రీమేక్ కి ఏమైంది ఎందుకని ఆగిపోయింది లాంటి విషయాలు ఎవ్వరికీ తెలియరాలేదు ఇప్పటి వరకు. తెలుగు లో ఇలాంటి కాన్సెప్ట్ కామన్ అనుకున్నారో…

లేక హీరో ఎవరూ సెట్ కాక పోవడం వలనో తెలియదు కానీ రీమేక్ పనులు మొత్తం ఆగిపోయాయి అని టాలీవుడ్ లో టాక్ గట్టిగా వినిపిస్తుంది, రాజ్ తరుణ్ కెరీర్ మొదట్లో ఎంత ఎనర్జీ తో మెప్పించారో ఈ సినిమాలో కూడా అంతే ఎనర్జీతో మెప్పించే అవకాశం ఉన్నా ఎందుకని పట్టాలు ఎక్కడం లేదో తెలియాల్సి ఉంది, త్వరలోనే సినిమా పై అప్ డేట్ వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు.

Leave a Comment