గాసిప్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

15 కోట్ల బోయకి షాక్…ఇప్పుడు రేటు ఇదే!!

టాలీవుడ్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే డైరెక్టర్స్ లో మాస్ లో భారీ క్రేజ్ ఉన్న బోయపాటి శ్రీను కూడా ఒకరు, కెరీర్ లో చేసిన సినిమాల్లో ఎక్కువగా మాస్ ని అలరించే సినిమాలే చేసిన బోయపాటి సింహా, లెజెండ్ మరియు సరైనోడు లాంటి సినిమాలతో మాస్ కి ఓ రేంజ్ లో చేరువ అయ్యాడు. కానీ ఒక్క సినిమా తో టోటల్ భవితవ్యం మారి పోయింది తనకి. అలా చేసిన సినిమా నే వినయ విదేయ రామ.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేసిన ఈ సినిమా క్వాలిటీ విషయం లో కానీ టేకింగ్ విషయం లో కానీ కథ పరంగా కానీ రొటీన్ రొట్ట అనిపించుకోవడమే కాకుండా భారీ గా నష్టాలను కూడా సొంతం చేసుకుని డిసాస్టర్ అయ్యింది. దాంతో ఒక్కసారిగా బోయపాటి మార్కెట్ కి దెబ్బ పడింది.

అప్పటి వరకు ఏ హీరో తో చేసినా కానీ అవలీలగా 12 కోట్ల నుండి 15 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునే బోయపాటి వినయ విదేయ రామ కి అన్నీ కలిపి 15 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు బోగట్టా. కానీ ఆ సినిమా రిజల్ట్ తర్వాత ఇప్పుడు…

నందమూరి బాలకృష్ణ తో చేయబోతున్న అప్ కమింగ్ మూవీ కి బోయపాటి రెమ్యునరేషన్ చాలా తగ్గిందని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది, నిర్మాత బోయపాటి కి ముందు 3 కోట్లు సినిమా హిట్ అయితే మరో 2 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తానని అన్నారని సమాచారం. బోయపాటి 8 కోట్లు డిమాండ్ చేశారని కానీ దానికి నిర్మాత ఒప్పుకోలేదని అంటున్నారు.

ఇది నిన్ను నీవు నిరూపించుకోవాల్సిన సమయం, ఎట్టి పరిస్థితులలో సినిమా హిట్ కొడితే లాభాల్లో కొంత వాటా ఇస్తానని నిర్మాత చెప్పారని, అందుకే ఇప్పుడు కసి తో కంబ్యాక్ ఇవ్వాలని బోయపాటి ప్రిపేర్ అవుతున్నారని అంటున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ ని టార్గెట్ చేసి త్వరలోనే నాన్ స్టాప్ గా సినిమా షూటింగ్ జరుగుతుందని అంటున్నారు.

Leave a Comment