Uncategorized గాసిప్స్ న్యూస్

150 కోట్ల సినిమా…హీరో ని చూసి బయపడుతున్నారు…!!

సినిమాని పోలిన సినిమాలు రావడం కామనే…కానీ కథా వస్తువు కొత్తది అయినప్పుడు సినిమా మరో సినిమా ని పోలి ఉన్నా కథనం బాగుంటే అవి కూడా బాగానే హిట్ అవుతాయి. బాలీవుడ్ లో రీసెంట్ టైం లో హిస్టారికల్ నేపధ్యంలో వచ్చిన మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిన డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి. కెరీర్ లో అద్బుతమైన భారీ బడ్జెట్ మూవీస్ తీసిన భన్సాలి మధ్యలో కొన్ని ఫ్లాఫ్స్ కొట్టినా…

తిరిగి రామ్ లీలా, భాజీరావ్ మస్తాని, పద్మావాత్ లాంటి సినిమాలతో అల్టిమేట్ బ్లాక్ బస్టర్స్ కొట్టాడు, కాగా ఈ డైరెక్టర్ తో సమానంగా భారీ బడ్జెట్ మూవీస్ తీస్తాడు అన్న పేరు తెచ్చుకున్న దర్శకుడు అశుతోష్ గోవారికార్ జోదా అక్బర్ లాంటి కల్ట్ మూవీ తో సత్తా చాటగా తర్వాత ఫామ్ కోల్పోయాడు.

ఇప్పుడు ఈ దర్శకుడు భాజీరావ్ మస్తాని ని పోలిన స్టొరీ పాయింట్ గెటప్స్ తో బాలీవుడ్ లో పానిపట్ యుద్ధం నేపధ్యంలో సినిమా చేస్తున్నాడు….. రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ అవ్వగా అందరు భాగుంది అని చెబుతున్నా అందులో హీరో ని చూసి భయపడుతున్నారు. సినిమా లో మెయిన్ లీడ్ లో అర్జున్ కపూర్ నటించాడు.

కెరీర్ లో నటన పరంగా తీవ్ర విమర్శలను ఎదురుకున్న నటుడిగా అక్కడ అర్జున్ కపూర్ కి పేరుంది, ఫేస్ లో ఎక్స్ ప్రెషన్స్ పలకవు అని కూడా అంటారు. అలాంటి హీరో పై ఏకంగా 150 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందించిన ఈ సినిమా ను ఏ నమ్మకంతో తీశారు అంటున్నారు.

ముందు బడ్జెట్ 80 కోట్లు అనుకున్నా భారీ సెట్టింగ్స్ తో బడ్జెట్ పెరుగుతూ పోయింది. హీరో కి రీసెంట్ టైం లో మంచి హిట్ కూడా లేదు, ఇటు డైరెక్టర్ కి కూడా పెద్దగా హిట్స్ లేవు. దాంతో 150 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా ఎంతవరకు అంచనాలను తట్టుకుంటుంది, నటుడిగా విమర్శలు ఎదురుకుంటున్న అర్జున్ కపూర్ కి హిట్ ఇస్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!