గాసిప్స్ న్యూస్

16 ఏళ్ల క్రితం ఎపిక్ బ్లాక్ బస్టర్…ఇప్పుడు రీమేక్…బడ్జెట్ ఎంతో తెలిస్తే షాకే!!

  ఒరిజినల్ కథలను కాకుండా రీమేక్ సినిమాలనే ఎక్కువగా నమ్ముకున్న ఇండస్ట్రీ గా బాలీవుడ్ నిలుస్తుందేమో… ఒరిజినల్ కథల కన్నా కూడా ఎక్కువ శాతం రీమేక్ ల మీదే డిపెండ్ అయ్యిన బాలీవుడ్ ఇప్పుడు మరోసారి మరో రీమేక్ కి రంగం సిద్ధం చేస్తుంది. కానీ ఈ సారి ఒరిజినల్ రూపొందించిన డైరెక్టర్ కూడా ఈ రీమేక్ పై ఎక్కువ ఆసక్తితో ఉండటం విశేషం. 2005 టైం లో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో…

షేక్ చేసిన సినిమా అపరిచుతుడు… శంకర్ డైరెక్షన్ లో విక్రం హీరోగా రూపొందిన ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా ఊహకందని విజయాన్ని నమోదు చేసింది, తర్వాత హిందీ లో కూడా డబ్ అయ్యిన ఈ సినిమా అక్కడ టెలివిజన్స్ లో విపరీతంగా టెలికాస్ట్ కూడా అయింది.

అలాంటి ఈ సినిమాను రిలీజ్ అయిన 16 ఏళ్ల తర్వాత ఇప్పుడు శంకర్ హిందీ లో రూపొందించాలని డిసైడ్ అయ్యాడు. విక్రం పోషించిన పాత్రను మళ్ళీ ఎవ్వరూ రిప్లేస్ చేయలేరు అనుకుంటే బాలీవుడ్ యంగ్ హీరోల్లో విలక్షణ రోల్స్ తో పాటు కమర్షియల్ రోల్స్ తో మెప్పించే సత్తా ఉన్న యాక్టర్ అయిన…

రణవీర్ సింగ్ ని హీరోగా తీసుకుని అపరిచుతుడు రీమేక్ లో కథ పాయింట్ ను అలానే తీసుకుని ఇప్పటి జనరేషన్ ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్లు అందులో మార్పులు చేర్పులు చేసి సినిమాను రూపొందించబోతున్నాడట శంకర్. ఇక ఈ సినిమా రామ్ చరణ్ తో కమిట్ అయిన సినిమా తర్వాత ఉంటుందా లేక ముందే ఉంటుందా అన్న వివరాలు తెలియాల్సి ఉండగా….

ఈ హిందీ రీమేక్ కోసం ఏకంగా 250 కోట్ల భారీ బడ్జెట్ ను నిర్మాత కేటాయించబోతున్నారని సమాచారం. ఫైనల్ బడ్జెట్ లెక్క 280 నుండి 300 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. ఈ రేంజ్ బడ్జెట్ లో అపరిచితుడు హిందీ వర్షన్ ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి ఇక..

Leave a Comment