న్యూస్ స్పెషల్

16 గంటల్లో ఇండియాలో నంబర్ 1…హ్యుమంగస్ రికార్డ్ ఇది!!

సోషల్ మీడియా లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ బర్త్ డే కి తిరుగు లేని రికార్డ్ బ్రేకింగ్ ట్రెండ్ ని గిఫ్ట్ గా ఇస్తున్నారు, టాలీవుడ్ తరుపునే కాకుండా ఇండియా వైడ్ గా కూడా ఆల్ టైం రికార్డ్ బ్రేకింగ్ ట్రెండ్ ని సొంతం చేసుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్… సోషల్ మీడియా లో గత రెండేళ్ళ లో పెద్దగా ట్రెండ్స్ లో పాల్గొనలేదనే కసి కావొచ్చు…

మరేదైనా కావొచ్చు… ఎన్టీఆర్ బర్త్ డే కి కొత్త సినిమా ల అప్ డేట్స్ ఏవి లేవని కోపం కావచ్చు, మొత్తం మీద ఈ కసి తో ఎన్టీఆర్ బర్త్ డే ట్రెండ్ ని ఇండియా వైడ్ గా బిగ్గెస్ట్ ట్విట్టర్ ట్రెండ్ గా నమోదు అయ్యేలా చేశారు.

నిన్న సాయంత్రం 6 గంటల నుండి మొదలు అయిన ట్రెండ్ సరికొత్త రికార్డులతో ఊచకోత కోస్తూ దూసుకు పోతుండగా, పుట్టిన రోజు ట్రెండ్స్ లో ఆల్ టైం రికార్డులను నమోదు చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ పాత రికార్డులను 7 గంటలకి అటూ ఇటూ గా టైం తీసుకుని బ్రేక్ చేయగా ఇప్పుడు మరో రికార్డ్ కొట్టారు.

రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గబ్బర్ సింగ్ ట్రెండ్ లో 24 గంటల్లో 13.4 మిలియన్ ట్వీట్స్ ని పోల్ చేసి బిగ్గెస్ట్ ట్రెండ్ రికార్డ్ ను నమోదు చేయగా… ఇప్పుడు ఆ రికార్డ్ ను బ్రేక్ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇండియా లో బిగ్గెస్ట్ ట్విట్టర్ ట్రెండ్ రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించారు.

ఆల్ మోస్ట్ 14 మిలియన్స్ రేంజ్ లో ట్వీట్స్ పోల్ అయ్యి ఇప్పటికే సరికొత్త రికార్డ్ నమోదు అవుతుండగా… ఇంకా 24 గంటలు పూర్తీ అవ్వడానికి చాలానే సమయం ఉండటం తో ఎపిక్ ట్రెండ్ గా ఈ బర్త్ డే ట్రెండ్ నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఇక 24 గంటల రిపోర్ట్ ఎలా ఉంటుందో చూడాలి..

Leave a Comment