న్యూస్ స్పెషల్

16.5 కోట్ల రేటు…ఫస్ట్ టైం రికార్డ్..2nd టైం కూడా రికార్డ్ TRP!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతి రేసు లో సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊరమాస్ రికార్డులు నమోదు చేసిన విషయం తెలిసిందే. సినిమా భారీ పోటి లో కూడా రికార్డులు సృష్టించి మహేష్ బాబు కెరీర్ లో నంబర్ 1 మూవీ గా నిలవడమే కాకుండా టాలీవుడ్ చరిత్ర లో కూడా వన్ ఆఫ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచి సంచలనం సృష్టించింది.

ఇక సినిమా వెండి తెరపై అద్బుతాలు సృష్టించిన తర్వాత బుల్లి తెరపై కూడా త్వరగానే టెలికాస్ట్ అయ్యి దుమ్ము దుమారం చేసింది. టాలీవుడ్ లీడింగ్ ఛానెల్ అయిన జెమినీ టీవీ వారు సినిమా శాటిలైట్ రైట్స్ హక్కులను 16.5 కోట్ల రేంజ్ రేటు చెల్లించి దక్కించుకోగా…

సినిమా ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు ఏకంగా 23.4 TRP రేటింగ్ ని సొంతం చేసుకుని బార్క్ వచ్చిన తర్వాత ఆల్ టైం బిగ్గెస్ట్ TRP రేటింగ్ ని అందుకుని రికార్డ్ సృష్టించగా రీసెంట్ గా రెండో సారి టెలికాస్ట్ అయిన సినిమా మరో సారి దుమ్ము లేపే రేంజ్ లో TRP రేటింగ్ ని అందుకుని సంచలనం సృష్టించింది.

సినిమా రెండో సారి టెలికాస్ట్ అయినప్పుడు మరోసారి రెచ్చిపోయి 17.4 TRP రేటింగ్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. లాక్ డౌన్ అంతా అయిపోయి ఉన్నా కానీ ఈ రేంజ్ లో TRP రేటింగ్ అందుకున్న సినిమా కొంచం ముందుగా లాక్ డౌన్ ఉన్న టైం లో మరోసారి అప్పుడే టెలికాస్ట్ అయి ఉంటే…

కచ్చితంగా ఇంతకన్నా కూడా ఎక్కువ TRP రేటింగ్ నే సొంతం చేసుకుని ఉండేది అని చెప్పొచ్చు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఇప్పుడు సర్కారు వారి పాట తో బిజీ కాబోతున్నాడు. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్ళ బోతుందని సమాచారం.

Leave a Comment