న్యూస్ స్పెషల్

17 ఏళ్ల కెరీర్ బెస్ట్ బ్లాక్ బస్టర్… ఆల్ టైం టాప్ 2 రచ్చ చేసిన ఫ్యాన్స్!!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ లో ముందు నిలిచే సినిమా సింహాద్రి, ఆది కూడా అల్టిమేట్ విజయాన్ని సొంతం చేసుకున్నా కానీ సింహాద్రి సినిమా సెన్సేషన్ ఊరమాస్ అనే చెప్పాలి. అలాంటి సెన్సేషనల్ సినిమాను కేవలం 19 ఏళ్ల వయసుకే సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి ఊరమాస్ బ్లాక్ బస్టర్ అయిన సింహాద్రి బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి…

17 ఏళ్ళు పూర్తీ చేసుకుంది, ఎన్టీఆర్ రాజమౌళి ల కాంబినేషన్ లో స్టూడెంట్ నంబర్ తర్వాత వచ్చిన ఈ మాస్ మూవీ ఓపెనింగ్స్ ని ఫుల్ రన్ వరకు సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేయగా టోటల్ రన్ లో 26 కోట్లకు పైగా షేర్ ని అందుకుని అప్పట్లో టాప్ 2 ప్లేస్ ని…

సొంతం చేసుకుని ఇంద్ర సినిమా తర్వాత ప్లేస్ ని దక్కించుకుంది. పోటిలో మరో బ్లాక్ బస్టర్ వసంతం కనుక లేకుండా ఉంటే కచ్చితంగా సినిమా ఇంద్ర రికార్డ్ బ్రేక్ చేసి ఉండేది. ఇక సినిమా రిలీజ్ అయిన 17 ఏళ్ళు పూర్తీ చేసుకున్న సందర్బంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ ట్రెండ్ ని మొదలు పెట్టగా..

స్టార్ట్ ఎన్టీఆర్ బర్త్ డే ట్రెండ్ రేంజ్ లో రాలేదు కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించే స్టార్ట్ అందుకుని స్టడీగా 24 గంటలు ముగించారు, చివరి గంటల్లో మాత్రం మాస్ స్పీడ్ ని చూపెట్టి ఓవరాల్ గా 24 గంటలు పూర్తీ అయ్యే సరికి మొత్తం మీద 8.8 మిలియన్ ట్వీట్స్ ని పోల్ చేసి ఆల్ టైం టాప్ 2 ప్లేస్ ని సొంతం చేసుకున్నారు.

ఫస్ట్ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 8 ఇయర్స్ ట్రెండ్ 13.4 మిలియన్స్ ట్వీట్స్ తో సినిమాల యానివర్సరీ ట్రెండ్స్ లో ఇప్పటికీ ఎవ్వరికీ అందనంత ఎత్తులో కొనసాగుతుండగా ఇది వరకు రెండో ప్లేస్ లో ఉన్న పోకిరి ట్రెండ్ 8.5 మిలియన్స్ ని బ్రేక్ చేసి ఇప్పుడు రెండో ప్లేస్ ని దక్కించుకున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్…

Leave a Comment