గాసిప్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

బ్లాక్ బస్టర్ల హీరో… కొత్త సినిమా 170 కోట్లట!!

ఒక సినిమా హిట్ అయిందంటే కొత్త సినిమాల కి క్రేజ్ ఓ రేంజ్ లో ఉంటుంది, ఇక వరుస విజయాలు ఉంటే మాత్రం నిర్మాతలు ఎంత డబ్బు పెట్టాడాని కైనా ముందుకు వస్తారు, కానీ ఆ డబ్బు ని మళ్ళీ రికవరీ చేయించాల్సిన భాద్యత హీరో పేరు మీదే ఉంటుంది అని చెప్పాలి. రీసెంట్ టైం లో జస్ట్ యావరేజ్ టాక్ తో కూడా వీర లెవల్ లో కలెక్షన్స్ ని అందుకుని సత్తా చాటిన….

హీరో లలో ముందు నిలిచే హీరో ఇలయ ధలపతి విజయ్… వరుసగా మెర్సల్ మరియు సర్కార్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర 200 కోట్ల హీరోగా పేరు తెచ్చుకుని సత్తా చాటాడు విజయ్. ముఖ్యంగా బిలో యావరేజ్ టు యావరేజ్ టాక్ ని సొంతం చేసుకున్న…

సర్కార్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని లెవల్ లో 250 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని భీభత్సం సృష్టించింది. అలాంటి విజయ్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ పై అంచనాలు స్కై హై లెవల్ లో ఉండగా ఆ సినిమా బడ్జెట్ కూడా స్కై…

హై లెవల్ లోనే ఉందని సమాచారం. విజయ్ కి తెరీ, మెర్సల్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన దర్శకుడు అట్లీ దర్శకత్వం లో చేస్తున్న హాట్రిక్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా స్పోర్ట్స్ బ్యాగ్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా బడ్జెట్ ఏకంగా…

170 కోట్ల రేంజ్ లో ఉందని సమాచారం, అయినా కానీ విజయ్ రికవరీ చేస్తాడన్న నమ్మకం తో నిర్మాత సినిమా కోసం ఇంత బడ్జెట్ పెడుతున్నాడని టాక్ ఇప్పుడు కోలివుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఈ దీపావళి కానుకగా రాబోతున్న ఈ సినిమా తో విజయ్ ఎలాంటి భీభత్సం సృష్టిస్తాడో చూడాలి మరి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!