న్యూస్

18 సెకన్ల ప్రోమోకే ప్రకంపనలు..మెంటల్ మాస్ రికార్డ్ ఇదీ!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబినేషన్ లో అత్యంత భారీ ఎత్తున పాన్ ఇండియా లెవల్ లో భారీ గా రూపొందుతున్న మూవీ పుష్ప, ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎప్పుడూ పోషించని డిఫెరెంట్ రోల్ చేస్తున్న అల్లు అర్జున్ ఊరమాస్ లుక్ లో కనిపించబోతున్న ఈ సినిమా పై అంచనాలు పీక్స్ లో ఉండగా సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు..

ఆగస్టు 13 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా లోని అల్లు అర్జున్ ఇంట్రో టీసర్ గ్లిమ్స్ ను అల్లు అర్జున్ పుట్టిన రోజు అయిన ఏప్రిల్ 7 న ఒకరోజు ముందుగానే సాయంత్రం 6 గంటల 12 నిమిషాలకు రిలీజ్ కాబోతుండగా దాని కోసం ఒక చిన్న ప్రోమోని రీసెంట్ గా రిలీజ్ చేశారు.

కేవలం 18 సెకన్ల పాటు ఉన్న ఈ ప్రోమో అల్టిమేట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది, రఫ్ కట్ లో అల్లుఅర్జున్ కనిపించకున్నా రన్నింగ్ చేసే విధానం, దేవి శ్రీ ప్రసాద్ అల్టిమేట్ బ్యాగ్రౌండ్ స్కోర్, సుకుమార్ మార్క్ టేకింగ్ అల్టిమేట్ అనిపించాయి. ఇక ఈ చిన్న ప్రోమోకి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది.

మొత్తం మీద 3 ఛానెల్స్ లో రిలీజ్ అయిన ఈ ప్రోమో ఒక ఛానెల్ లో 3.08 మిలియన్స్ వ్యూస్ ని 201K లైక్స్ ని సాధించగా రెండో ఛానెల్ లో 1.87M వ్యూస్ ని, 143K లైక్స్ ని అందుకుంది. ఇక మూడో ఛానెల్ లో 347K వ్యూస్ ని 42K లైక్స్ ని సొంతం చేసుకోగా మూడు ఛానెల్స్ కలిపి టోటల్ గా…

5.29 మిలియన్స్ వ్యూస్ ని 390K లైక్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది, చిన్న ప్రోమో కే ఇలా ఉంటె ఇక పుష్పరాజ్ ఇంట్రో గ్లిమ్స్ కచ్చితంగా సంచలనాలను సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి ఇక..

Leave a Comment