న్యూస్ బాక్స్ ఆఫీస్

18.8 కోట్ల టార్గెట్…40 కోట్ల షేర్…2.5 రేటింగ్ తో మాస్ జాతర!!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి 30 రోజులకు పైగా అవుతున్నా ఇప్పటికీ మాస్ సెంటర్స్ లో స్టడీ కలెక్షన్స్ తో రన్ అవుతూ దూసుకు పోతున్న సినిమా రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర మీడియం రేంజ్ హీరోలకు బిగ్గెస్ట్ టార్గెట్ గా ఉండే మ్యాజికల్ 40 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని సత్తా చాటుకుంది. రామ్ కెరీర్ లో…

ఇది మొట్ట మొదటి 40 కోట్ల షేర్ మూవీ గా చెప్పుకోవచ్చు. బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రలల్లో 34 రోజులు ముగిసే సమయానికి ఈ సినిమా 37 కోట్లకు పైగా షేర్ ని అందుకుని దుమ్ము లేపింది. మాస్ సెంటర్స్ లో డైలీ కలెక్షన్స్ 10 లక్షల రేంజ్ లో వస్తుండటం విశేషం.

ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 40.30 కోట్ల షేర్ ని అందుకుని మరోసారి సంచలనం సృష్టిస్తూ మీడియం రేంజ్ హీరోలలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ షేర్ ని అందుకున్న సినిమా గా నిలిచింది. సినిమా లాంగ్ రన్ లో మరో కోటి దాకా వసూల్ చేసినా ఆశ్యర్య పోనవసరం లేదు.

మొత్తం మీద సినిమా వారం వారం కొత్త సినిమాలు వస్తున్నా కానీ స్టడీ రన్ ని కొనసాగిస్తుండటం విశేషం, కాగా సినిమా రిలీజ్ అవ్వడం 2.5 రేటింగ్ రేంజ్ లో రిలీజ్ అయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ రేంజ్ ని మించి ఇప్పుడు డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

టార్గెట్ 18.8 కోట్లు అయితే ఇప్పటికే 21.5 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని మీడియం రేంజ్ మూవీస్ లో భారీ లాభాలు సొంతం చేసుకున్న అతి కొద్ది సినిమాలలో ఒకటిగా నిలిచి సత్తా చాటుకుంది ఈ సినిమా. ఇక ఫైనల్ రన్ కంప్లీట్ అయ్యే సరికి మరిన్ని కలెక్షన్స్ ఈ ఖాతాలో పడటం ఖాయమని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment