గాసిప్స్ న్యూస్

180 కోట్ల సినిమా…ఎవ్వరూ పట్టించుకోవడం లేదు…ఇప్పుడు హీరో కూడా!!

సహజంగా భారీ బడ్జెట్ మూవీస్ అంటే ఎక్కువ కేర్ తీసుకుని సినిమాలను పూర్తీ చేస్తూ ఉంటారు, చాలా వరకు బడ్జెట్ సరిపోక పొతే సినిమాలను మధ్యలో వదిలేస్తారు కానీ ఇక్కడ బడ్జెట్ పెట్టే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా సినిమాను మధ్యలోనే వదిలేశారు. ఆ సినిమానే ఇండియన్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ మరియు విశ్వనటుడు కమల్ హాసన్ ల కాంబినేషన్ లో రూపొందిన భారతీయుడు సినిమా సీక్వెల్ భారతీయుడు 2 సినిమా..

ఈ సినిమా మొదలు అయ్యి చాలా కాలం అయింది, ఆల్ మోస్ట్ నిర్మాతలు అయిన లైకా ప్రొడక్షన్ వాళ్ళు ఈ సినిమా కోసం ఏకంగా 180 కోట్ల బడ్జెట్ ను ఇప్పటి వరకు ఖర్చు చేశారు. ఇంకా 50 కోట్ల రేంజ్ బడ్జెట్ అవసరం ఉండగా అది కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు…

కానీ అటు డైరెక్టర్ శంకర్ కానీ ఇటు హీరో కమల్ హాసన్ కానీ సినిమా గురించి అసలు పట్టించుకోవడం లేదని తెలుస్తుంది, శంకర్ ఇప్పుడు ఇతర సినిమాలను కమిట్ అవ్వగా కమల్ హాసన్ రీసెంట్ గా జరిగిన తమిళనాడు ఎలెక్షన్స్ లో పోటి చేయడం తో ఈ సినిమా జోలికి వెళ్ళలేదు.

ఇప్పుడు ఎలేక్షన్స్ అయిపోయాయి కమల్ హాసన్ కొన్ని ఓట్ల తేడాతో ఓడిపోవడం తో తిరిగి బిజీ అయ్యే పనుల్లో ఉండగా బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ కోసం అలాగే లోకేష్ కనగారాజ్ డైరెక్షన్ లో చేస్తున్న విక్రం సినిమాల పనుల్లో బిజీ అయ్యారని కోలివుడ్ లో చెప్పుకుంటున్నారు. కానీ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటైన భారతీయుడు 2 సినిమా ఊసు కూడా లేదని అంటున్నారు.

దాంతో ఇప్పటి వరకు 180 కోట్ల బడ్జెట్ పెట్టిన నిర్మాత ఈ సినిమా ను పూర్తీ చేయాలనీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అటు డైరెక్టర్ ఇటు ఇప్పుడు హీరో కూడా ఎలాంటి ఆసక్తి చూపడం లేదు అంటూ చెప్పుకుంటున్నారు. ఇక కోలివుడ్ ఇండస్ట్రీ పెద్దలు కలగజేసుకుని ఈ సినిమా విషయం లో ఏదైనా నిర్ణయం తీసుకుంటారని ఇప్పుడు అంటున్నారు. మరి ఇది ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందో చూడాలి.

Leave a Comment