గాసిప్స్ న్యూస్

187 కోట్ల సినిమా…నో చెప్పి షాక్ ఇచ్చిన రామ్!!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తమిళ్ సూపర్ హిట్ తడం సినిమా తెలుగు రీమేక్ ని కంప్లీట్ చేసి థియేటర్స్ రీ ఓపెన్ చేశాక సినిమా ను రిలీజ్ చేసే పని లో ఉన్నాడు, OTT ఆఫర్స్ వచ్చినా కానీ ముందు నుండి థియేటర్స్ లోనే సినిమా ను రిలీజ్ చేయాలి అనుకున్న రామ్ తర్వాత యూనిట్ OTT వైపు అడుగులు వేసినా…

రేట్లు తగ్గించి అన్ని సినిమాలకు చెప్పినట్లు రేట్లు చెప్పడం తో ఇక్క OTT లు వద్దని ఫిక్స్ అయ్యాడు, కాగా ఇప్పుడు కొత్త సినిమాలు ఏమి కమిట్ అవ్వని హీరోలలో కూడా ఒకరిగా నిలిచాడు రామ్, ఇతర హీరోలు లాక్ డౌన్ టైం లో కొత్త కథలను ఓకే చేయగా…

రామ్ తన దగ్గరకు వచ్చిన కొత్త కథలలో వేటిని కూడా ఫైనల్ చేయలేదు, కాగా ఇప్పుడు బాలీవుడ్ నుండి బ్లాక్ బస్టర్ రీమేక్ ఆఫర్ రామ్ కి వెళ్ళింది అనేది లేటెస్ట్ గా టాలీవుడ్ లో వినిపిస్తున్న న్యూస్. ఆ న్యూస్ ప్రకారం రామ్ కి హిందీ లో….

7 ఏళ్ల క్రితం రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయిన రణబీర్ కపూర్ దీపిక పదుకునే ల కాంబినేషన్ లో వచ్చిన “హే జవానీ హే దివానీ” సినిమా 187 కోట్ల కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలుగు రీమేక్ ఆఫర్ వెళ్ళింది అని అంటున్నారు. ఇది వరకు ఈ రీమేక్ ఆఫర్ అఖిల్ దగ్గరకు వెళ్ళగా అప్పుడు వేరే సినిమాల కమిట్ మెంట్స్ వలన నో చెప్పాడు.

తర్వాత ఈ రీమేక్ పై తెలుగు లో ఎలాంటి అప్ డేట్ లేదు, మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ సినిమా రీమేక్ తెరపైకి రాగా రామ్ కి సినిమా బాగా సూట్ అవుతుంది అనుకున్నారు, కానీ రామ్ ఇప్పుడే తడం ని తెలుగు లో రీమేక్ చేయగా వెంటనే మరో రీమేక్ వద్దు అని నో చెప్పారని టాక్ వస్తుంది, మరి ఇది ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది..

Leave a Comment