టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

187 కోట్ల సినిమా….మళ్ళీ నో చెప్పిన రామ్ పోతినేని!

కొన్ని సినిమాలు కొందరి కోసమే ఎదురు చూస్తాయి అంటారు, రాసి పెట్టి ఉంటే ఎటూ తిరిగి చివరికి ఎవరికి చేరాలో వారి దగ్గరకే వస్తుంది అంటారు, టాలీవుడ్ లో చాలా కాలంగా వార్తల్లో ఉంటూ వస్తున్న సినిమా ఒకటి ఒక్క హీరో దగ్గరకే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండటం విశేషం, కానీ హీరో మళ్ళీ మళ్ళీ రిజక్ట్ చేయడానికి రీజన్స్ ఏంటో అన్నది మాత్రం ఎవ్వరికీ అంతు పట్టని జవాబు గా చెప్పుకోవచ్చు….

ఆ సినిమానే బాలీవుడ్ లో 8 ఏళ్ల క్రితం సమ్మర్ లో రిలీజ్ ఊహకందని బ్లాక్ బస్టర్ గా నిలిచిన హే జవానీ హై దివానీ సినిమా, రణబీర్ కపూర్ కెరీర్ లో అప్పట్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమాను తెలుగు లో రీమేక్ చేయాలనీ ట్రై చేస్తూనే ఉన్నారు కానీ ఎవ్వరూ సెట్ అవ్వడం లేదు…

ఎనర్జిటిక్ స్టార్ రామ్ దక్కరికి ఈ కథ ఇప్పటికే 2 సార్లు వెళ్ళింది, రెండు సార్లు కొన్ని కారణాల వలన ఈ సినిమాను రిజక్ట్ చేశాడు రామ్, ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాల విజయాల తర్వాత లింగుస్వామి డైరెక్షన్ లో బైలింగువల్ మూవీ చేస్తున్న రామ్ పోతినేని సెకెండ్ వేవ్ టైం లో అప్ కమింగ్ మూవీస్ పై కూడా ఫోకస్ పెట్టగా

మళ్ళీ ఈ కథ రామ్ దగ్గరికి వచ్చిందట… 8 ఏళ్ల క్రితం రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయిన రణబీర్ కపూర్ దీపిక పదుకునే ల కాంబినేషన్ లో వచ్చిన “హే జవానీ హే దివానీ” సినిమా 187 కోట్ల కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇది వరకు ఈ రీమేక్ ఆఫర్ అఖిల్ దగ్గరకు వెళ్ళగా అప్పుడు వేరే సినిమాల కమిట్ మెంట్స్ వలన నో చెప్పాడు.  తర్వాత ఈ రీమేక్ పై తెలుగు లో ఎలాంటి అప్ డేట్ లేదు,

తర్వాత ఈ సినిమా రీమేక్ తెరపైకి రాగా రామ్ కి సినిమా బాగా సూట్ అవుతుంది అనుకున్నారు, కానీ రామ్ ఇప్పుడే తడం ని తెలుగు లో రీమేక్ చేయగా వెంటనే మరో రీమేక్ వద్దు అని నో చెప్పారని టాక్ వచ్చింది… ఇక ఇప్పుడు రెడ్ హిట్ తర్వాత లింగుస్వామి మూవీ చేస్తుండటం తో తర్వాత ఈ సినిమా చేస్తారేమో అని అడిగినా రామ్ మళ్ళీ ఎందుకో నో చెప్పారని అంటున్నారు. మరి ఎందుకో అన్నది తెలియాల్సి ఉంది…

Leave a Comment