న్యూస్ బాక్స్ ఆఫీస్

1880 కోట్ల సినిమా ఇది…అయినా ఫ్లాఫ్ అని తేల్చేశారు!!

ఓవర్సీస్ పరిస్థితులు ఒక సినిమాతో బాగు పడ్డాయి అని అంతా అనుకున్నారు కానీ లేటెస్ట్ గా రిలీజ్ అయిన మరో సినిమా మాత్రం నిరాశనే మిగిలిస్తుంది అంటున్నారు… ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం తో మార్వెల్ నుండి లాస్ట్ ఇయరే రావాల్సిన బ్లాక్ విడో సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా అప్పటి నుండి సినిమా పోస్ట్ పోన్ అవుతూ ఉండగా…

ఎట్టకేలకు రీసెంట్ గా సినిమా థియేటర్స్ లో మరియు డిజిటల్ లో ఒకేసారి రిలీజ్ అయింది. కానీ సినిమా కి మార్వెల్ లో ఇది వరకు వచ్చిన మూవీస్ తో పోల్చితే టాక్ వీక్ గా రావడం కలెక్షన్స్ పై ఇంపాక్ట్ ని చూపింది. ఓపెనింగ్స్ అద్బుతంగా వచ్చి పాండమిక్ తర్వాత…

రికార్డులను క్రియేట్ చేసినా కానీ తర్వాత టాక్ ఎఫెక్ట్ వలన సినిమా కలెక్షన్స్ భారీగా తగ్గిపోయాయి. అయినా కానీ సినిమా ఇప్పటి వరకు 250 మిలియన్ డాలర్స్ ని వసూల్ చేసిందని అంటున్నారు. అంటే ఇండియన్ కరెన్సీ లో 1880 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని ఈ సినిమా సొంతం చేసుకుందట…

అయినా కానీ ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ గానే మిగిలిపోబోతుందని అంటున్నారు. దానికి కారణం సినిమా ఓవరాల్ గా థియేట్రికల్ అండ్ డిజిటల్ బిజినెస్ కలిపి 400 మిలియన్ డాలర్స్ బిజినెస్ చేసిందట… అంటే సినిమా హిట్ అవ్వాలి అంటే 410 మిలియన్ డాలర్స్ అయినా కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉందని… కానీ సినిమా పరిస్థితి చూస్తుంటే…

300 మిలియన్ మార్క్ ని కూడా అందుకోవడం కష్టంగా కనిపిస్తున్న నేపధ్యంలో సినిమా ఓవరాల్ గా ఇక ఫ్లాఫ్ గా నిలిచిపోవడం ఖాయమని అంటున్నారు. ఇదే కనుక జరిగితే మార్వెల్ నుండి రీసెంట్ టైం లో ఫ్లాఫ్ అయిన మొదటి మూవీ ఇదే అవుతుందని చెప్పొచ్చు. మరి లాంగ్ రన్ లో సినిమా ఇంకెంత రికవరీ చేయగలుగుతుందో చూడాలి.

Leave a Comment