న్యూస్ బాక్స్ ఆఫీస్

1st డే అన్ని రికార్డులు ఔట్….పాజిటివ్ టాక్ పవర్!

కోలివుడ్ స్టార్ హీరో సూర్య కి రీసెంట్ టైం లో సరైన సినిమా అయితే పడలేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర నికార్సయిన హిట్ ని సొంతం చేసుకోలేక పోయిన సూర్య ఆశలన్నీ తన కొత్త సినిమా సూరరై పోట్రు తెలుగు లో ఆకాశం నీ హద్దు రా సినిమా పైనే పెట్టుకోగా… ఈ సినిమా కరోనా వలన పోస్ట్ పోన్ అవుతూ వచ్చి రీసెంట్ గా….

డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుని అమెజాన్ ప్రైమ్ లో సొంతం చేసుకుంది… కాగా సినిమా రిలీజ్ కి ముందు వరకు సూర్య రీసెంట్ మూవీస్ రిజల్ట్ వలన ఎక్కడో చిన్న డౌట్ అందరిలోనూ ఉండేది సినిమా కూడా సూర్య రీసెంట్ మూవీస్ లా నిరాశ పరుస్తుందేమో అని…

కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత యునానిమస్ రిపోర్ట్స్ ని సొంతం చేసుకోవడమే కాకుండా డైరెక్ట్ రిలీజ్ అయిన సినిమాల్లో ది బెస్ట్ మూవీ గా డిసైడ్ చేస్తున్నారు. ఇక సినిమా లో సూర్య పెర్ఫార్మెన్స్ కి అల్టిమేట్ రెస్పాన్స్ వస్తూ ఉండగా సినిమా కి అమెజాన్ ప్రైమ్ లో…

అల్టిమేట్ వ్యూస్ మొదటి రోజుకి గాని దక్కాయని అంటున్నారు. అమెజాన్ వాళ్ళు యూనిట్ కి సినిమా ఫస్ట్ డే ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనింగ్ వ్యూస్ ని సొంతం చేసుకుందని తెలియజేశారట. ఆ వ్యూస్ లెక్కలు ఎంత అనేది చెప్పలేదు, కానీ ఇండియా లో బిగ్గెస్ట్ OTT ప్లాట్ ఫాం అయిన అమెజాన్ ప్రైమ్ లో….

ఇప్పటి వరకు రిలీజ్ అయిన అన్ని సినిమాల వ్యూస్ తో పోల్చితే ఈ సినిమా కి ఆల్ టైం రికార్డ్ వ్యూస్ దక్కాయని అంటున్నారట. త్వరలోనే సినిమా కి ఎంతవరకు వ్యూస్ వచ్చాయి అన్నది మరింత క్లియర్ లెక్కలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్ గా సాలిడ్ స్టార్ట్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా లాంగ్ రన్ లో సెన్సేషన్ ని క్రియేట్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

Leave a Comment